కరోనా బాధితులపై హాస్పిటల్ పైశాచికం, రంగంలోకి కేటీఆర్

By Sreeharsha Gopagani  |  First Published Jul 30, 2020, 11:21 AM IST

ఈ కరోనా కష్టకాలంలో జనాలను పీడించుకుతింటున్న ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ను కోరారు కేటీఆర్.


కరోనా వైరస్  మహమ్మారి  ప్రపంచాన్ని పట్టి   ఆసుపత్రులు కరోనా రోగుల కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని డెక్కన్ ఆసుపత్రి సోమాజిగూడ వ్యవహరించిన తీరుపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. 

ఈ కరోనా కష్టకాలంలో జనాలను పీడించుకుతింటున్న ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ను కోరారు కేటీఆర్. రాధేశ్ అనే యువకుడు, తన తల్లి, తండ్రి సోదరుడిని కరోనా కి కోల్పోయి, దాదాపు 40 లక్షల రూపాయలను ఆ ఆసుపత్రిలో అప్పటికే చెల్లించినప్పటికీ... తండ్రి శవాన్ని అప్పగాయించాలంటే మరో ఏడున్నర లక్షల డిమాండ్ చేసారని ఆ యువకుడు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కి తెలిపాడు. 

Latest Videos

undefined

దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ ఆ యువకుడికి తన సానుభూతిని ప్రకటిస్తూనే ఆ ఆసుపతిహ్త్రులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు ఇప్పటికే ఈ విషయం పై దృష్టి సారించారు కూడా. 

ఇక వివరాల్లోకి వెళితే.... రాధేశ్ అనే యువకుడి తల్లిదండ్రులకు, అతనికి, అతని  లేకపోవడంతో  క్వారంటైన్ లో ఉన్నారు. అతడి తల్లి, తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు చికిత్స పొందుతుండగానే అతడి తల్లి మరణించింది. 

తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తన తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకు డైపర్ మార్వాదానికి కూడా ఎవరు లేరని చెప్పడానికి ఆయన ఫోన్ చేసాడు. తల్లి మరణించిన విషయం అతని తండ్రికి తెలియదు. ఆసుపత్రి వారికి ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. చివరకు ఎవరో అయితే వచ్చారు. ముగ్గురికి  దాదాపుగా 40 లక్షల రూపాయల రూపాయలను కట్టినప్పటికీ... వచ్చిన సమాధానం ఇది. 

ఇక అదే రోజు రాత్రి అతని తండ్రి కూడా  అక్కడకు చేరుకుంటుండగానే ఓఆర్ఆర్ మూసివేయడంతో అక్కడి పోలీస్ అధికారిని రిక్వెస్ట్ చేసినప్పటికీ... ఆయన చాలా  మాట్లాడాడట. అక్కడికి వెళ్ళాక, అతడి తండ్రి  వెనక్కి ఇవ్వడానికి వారు మరో ఏడున్నర  లక్షలను డిమాండ్ చేశారట. 

ఆ యువకుడు తన దీనగాథనంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనికి కేటీఆర్ స్పందించి ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకొమ్మని ఈటెలను ఆదేశించారు. 

click me!