తెలంగాణలో కరోనా వ్యాప్తి: 70 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Aug 05, 2020, 09:12 AM IST
తెలంగాణలో కరోనా వ్యాప్తి: 70 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 70 వేలు దాటింది. హైదరాబాదులో కోవిడ్ -19 వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రంగారెడ్డి, మేడ్చెల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కూడా ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2012 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70958కి చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో 13 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 576కు చేరుకుంది.

తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాదులో కరోనా వ్యాప్తి కట్టడి కావడం లేదు. గత 24 గంటల్లో హైదరాబాదులో 532 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కూడా అధికంగానే కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 198 కేసులు నమోదయ్యాయి.  వరంగల్ అర్బన్ లో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఈ జిల్లాలో గత 24 గంటల్లో 127 కేసులు రికార్డయ్యాయి. 

గత 24 గంటల్లో అదిలాబాదు జిల్లాలో 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52, జగిత్యాల జిల్లాలో 27 కేసులు నమోదయ్యాయి. జనగామలో కేసులేవీ రికార్డు కాలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 46, జోగులాంబ గద్వాల జిల్లాలో 48, కామారెడ్డి జిల్లాలో 75, కరీంనగర్ జిల్లాలో 41, ఖమ్మం జిల్లాలో 97 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 

కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాలో కేసులేవీ నమోదు కాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో 51, మహబూబాబాద్ జిల్లాలో 36, మంచిర్యాలలో ఒకటి, మెదక్ జిల్లాలో 21, ములుగు జిల్లాలో 18, నాగర్ కర్నూలు జిల్లాలో 19, నల్లగొండ జిల్లాలో 49, నారాయణపేట జిల్లాలో 4, నిర్మల్ జిల్లాలో 9 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.

నిజామాబాద్ జిల్లాలో 83, పెద్దపల్లి జిల్లాలో 41, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10, సంగారెడ్డి జిల్లాలో 89, సిద్దిపేట జిల్లాలో 28, సూర్యాపేట జిల్లాలో 27, వికారాబాద్ జిల్లాలో 6, వనపర్తి జిల్లాలో 20, వరంగల్ రూరల్ జిల్లాలో 28, యాదాద్రి భువనగిరి జిల్లాలో 26 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu