తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 72 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 21, 2020, 10:02 AM IST
తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 72 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 72 వేల మార్కు దాటింది. హైదరాబాదులో కొత్తగా గత 24 గంటల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూ నే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1302 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 82 వేల 608కి చేరుకుంది. 

తెలంగాణలో తాజాగాగా గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1042కు చేరుకుంది. తెలంగాణలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి లక్షా 49 వేల 930 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇంకా 29636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

హైదరాబాదులో గత 24 గంటల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. కేవలం 266 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ గత 24 గంటల్లో కేసుల సంఖ్య తక్కువగానే నమోదైంది. ఈ జిల్లాలో 98 కేసులు మాత్రమే రికార్డయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొత్తగా కేసులు నమోదు కాకపోవడం విశేషం.

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

ఆదిలాబాద్ 8
భద్రాద్రి కొత్తగూడెం 29
జిహెచ్ఎంసి 266
జగిత్యాల 34
జనగామ 18
జయశంకర్ భూపాలపల్లి 0
జోగులాంబ గద్వాల 18
కామారెడ్డి 14
కరీంనగర్ 102
ఖమ్మం 35
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 8
మహబూబ్ నగర్ 24
మహబూబాబాద్ 45
మంచిర్యాల 20
మెదక్ 16
మేడ్చెల్ మల్కాజిగిరి 24
ములుగు 15
నాగర్ కర్నూలు 37
నల్లగొండ 70
నారాయణపేట 4
నిర్మల్ 13
నిజామాబాద్ 50
పెద్దపల్లి 20
రాజన్న సిరిసిల్ల 23
రంగారెడ్డి 98
సంగారెడ్డి 54
సిద్ధిపేట 92
సూర్యాపేట 26
వికారాబాద్ 10
వనపర్తి 25
వరంగల్ రూరల్ 18
వరంగల్ అర్బన్ 62
యాదాద్రి భువనగిరి 24

 

PREV
click me!

Recommended Stories

Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu