తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 71 వేల మార్కును దాటింది. హైదరాబాదులో ఎప్పటిలాగే కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి యధావిధిగా కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో ఎప్పటిలాగానే 2 వేలకు పైగా కోరనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2137 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్,ా 71 వేల 306కు చేరుకుంది.
తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1033కు చేరుకుంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య రాష్ట్రంలో లక్షా 39 వేల 700కు చేరుకుంది. ఇంకా 30573 యాక్టివ్ కేసులున్నాయి.
undefined
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా వైరస్ నిలకడగానే కొనసాగుతోంది. హైదరాబాదులో గత 24 గంటల్లో 322 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 182 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో ఆ జిల్లాలో కేవలం 146 కేసులు మాత్రమే రికార్డయ్యాయి.
తెలంగాణలో గత 24 గంటల్లో జిల్లాలవారీగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి...
ఆదిలాబాద్ 20
భద్రాద్రి కొత్తగూడెం 51
జిహెచ్ఎంసీ 322
జగిత్యాల 42
జనగామ 34
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 27
కామారెడ్డి 60
కరీంనగర్ 132
ఖమ్మం 90
కొమరంభీం ఆసిఫాబాద్ 16
మహబూబ్ నగర్ 28
మహబూబాబాద్ 72
మంచిర్యాల 38
మెదక్ 28
మేడ్చెల్ మల్కాజిగిరి 146
ములుగు 15
నాగర్ కర్నూలు 37
నల్లగొండ 124
నారాయణపేట 9
నిర్మల్ 24
నిజామాబాద్ 72
పెద్దపల్లి 48
రాజన్న సిరిసిల్ల 57
రంగారెడ్డి 182
సంగారెడ్డి 65
సిద్ధిపేట 109
సూర్యాపేట 61
వికారాబాద్ 29
వనపర్తి 29
వరంగల్ రూరల్ 24
వరంగల్ అర్బన్ 90
యాదాద్రి భువనగిరి 35
Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 20.09.2020) pic.twitter.com/zvYSoZqiUH
— Dr G Srinivasa Rao (@drgsrao)