రంగారెడ్డిలో ఉధృతి: తెలంగాణలో లక్షా 57 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 13, 2020, 09:18 AM IST
రంగారెడ్డిలో ఉధృతి: తెలంగాణలో లక్షా 57 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 57 వేల మార్కును దాటింది. హైదరాబాదులో కరోనా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2216 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 57 వేల 96కు చేరుకుంది. 

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 961కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2603 మంది కోలుకున్నారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 24 వేల 258కి చేరుకుంది. ఇంకా 31607 యాక్టివ్ కేసులున్నాయి. 

హైదరాబాదుకు ఈ రోజు కూడా ఊరట లభించింది. హైదరాబాదులో గత 24 గంటల్లో 400కు దిగువగానే కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మాత్రం కాస్తా ఉధృతమైనట్లు కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా వైరస్ కేసులు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ 24
భద్రాద్రి కొత్తగూడెం 49
జిహెచ్ఎంసి 341
జగిత్యాల 56
జనగామ 33
జయశంకర్ భూపాలపల్లి 25
జోగులాంబ గద్వాల 20
కామారెడ్డి 45
కరీంనగర్ 119
ఖమ్మం 105
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 24
మహబూబ్ నగర్ 36
మహబూబాబాద్ 64
మంచిర్యాల 45
మెదక్ 28
మేడ్చెల్ మల్కాజిగిరి 148
ములుగు 23
నాగర్ కర్నూలు 31
నల్లగొండ 126
నారాయణపేట 11
నిర్మల్ 28
నిజామాబాద్ 84
పెద్దపల్లి 52
రాజన్న సిరిసిల్ల 54
రంగారెడ్డి 210
సంగారెడ్డి 76
సిద్ధిపేట 66
సూర్యాపేట 76
వికారాబాద్ 24
వనపర్తి 25
వరంగల్ రూరల్ 24
వరంగల్ అర్బన్ 102
యాదాద్రి భువనగిరి 42

 

PREV
click me!

Recommended Stories

Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu