గోదావరిఖనిలో ఇద్దరికి కరోనా సోకినట్లు ప్రచారం... ఐదుగురు యువకులు అరెస్ట్

By Arun Kumar PFirst Published Mar 21, 2020, 9:01 PM IST
Highlights

సోషల్ మీడియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ కటకటాల వెనక్కి నెట్టారు. 

కరీంనగర్: కరోనా వైరస్ పై సామాజిక మధ్యమాలలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ హెచ్చరించారు. కరోనా వ్యాధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం, రామగుండము కమీషనరేట్ పోలీస్  యంత్రాంగం ప్రజలలో అవగాహన  కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు. 

కొందరు ఆకతాయిలు వార్తా చానళ్ల బ్రేకింగ్ పేరుతో కంప్యూటర్లో గ్రాఫిక్స్  తయారు చేసి సామాజిక మధ్యమాలలో పోస్టు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని... అలాంటి వారిని గుర్తించి సైబర్ క్రైం సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది వ్యక్తులు పట్టణంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ టివి ఛానల్ లోగో వాడి తప్పుడు బ్రేకింగ్ న్యూస్ సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి  వైరల్ చేశారని తెలిపారు. 

ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారం కావడంతో గోదావరిఖని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయాందోళనకు గురికావడం జరిగిందన్నారు. ఈ సంఘటనను రామగుండం పోలీస్ కమిషనర్ సీరియస్ గా పరిగణించి గోదావరిఖని వన్ టౌన్ సీఐ పి. రమేష్ టాస్క్  ఫోర్స్,  స్పెషల్ బ్రాంచ్ విభాగం, సైబర్ క్రైమ్ ,ఐటి  కోర్ టెక్నికల్ వారికి వారిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

సిపి ఆదేశాల ప్రకారం అధికారులు వదంతులను సొషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు  ఏఏ గ్రూపులలో ఈ మెసేజ్ పంపించారు, సంబందిత గ్రూప్ అడ్మిన్ల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

   
 

click me!