విజృంభిస్తున్న కరోనాపై పోరాటం... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Mar 21, 2020, 7:23 PM IST
Highlights

కరోనా మహమ్మరిని సమర్థవంతంగా ఎదుర్కోడానికి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

హైదరాబాద్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారితో పోరాడేందుకు భారతదేశం సిద్దమైంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటతో తెలంగాణ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 

ఈ వైరస్ కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్న క్రమంలో ఇకపై అవసరమయ్యే మెడికల్ సిబ్బందిని ముందుగానే సిద్దం చేస్తోంది. ఇప్పటికే వున్న డాక్టర్లు, నర్సులపై పనిభారం పెరగకుండా చూడటంతో పాటు వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రిటైర్డ్ వైద్యులు, నర్సుల సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. 

read more  మరింత తీవ్రరూపంలోకి కరోనా... తెలంగాణలో ప్రైమరీ కాంటాక్ట్ కేసు

గత ఐదేళ్లుగా రిటైరయిన డాక్టర్లు, నర్సుల సేవలు వినియోగించుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. మూడు నెలల కాంట్రాక్టు పద్దతిలో వారిని విధుల్లోకి తీసుకోవాలని సంబంధిత అదికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే వైద్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

కరోనా వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇటలీలోని పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 18 మందికి ఏ విధమైన ప్రాణాపాయం లేదని ఆయన చెప్పారు.   

కరీంనగర్ కు విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా వైరస్ ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఆందోళన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. డిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వారు కరీనగర్ కు వచ్చినట్లు తెలుస్తోంది.  

read more  తెలంగాణలో 21 కరోనా కేసులు, 24 గంటల జనతా కర్ఫ్యా: కేసీఆర్

విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నవారి కోసం ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కజికిస్తాన్, దుబాయ్, ఇండోనేషియాల నుంచి వచ్చినవారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. 

తెలంగాణలో 104 కాల్ సెంటర్ కు రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం కరోనా కట్టడికి 116.28 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ల్యాబ్స్, ప్రత్యేక పరికరాల కోసం 33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. క్వారంటైన్, స్క్రీనింగ్ కోసం 83.25 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

click me!