తెలంగాణలో కరోనా విజృంభణ: 84 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Aug 12, 2020, 09:15 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: 84 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 84 వేల మార్కును దాటింది. తాజాగా తెలంగాణలో 1897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 84 వేల మార్కును దాటాయి. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 1897 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 84,544కు చేరుకుంది. 

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా కరోనా వైరస్ తో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 654కు చేరుకుంది. గత రెండు రోజులుగా హైదరాబాదులో తగ్గుతూ వచ్చిన కేసులు ఈ రోజు పెరిగాయి. హైదరాబాదులో గత 24 గంటల్లో 479 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 21
భద్రాద్రి కొత్తగూడెం 44
జిహెచ్ఎంసి 479
జగిత్యాల 28
జనగామ 26
జయశంకర్ భూపాలపల్లి 16
జోగులాంబ గద్వాల 38
కామారెడ్డి  48
కరీంనగర్ 64  
ఖమ్మం 63
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 5 
మహబూబ్ నగర్ 41
మహబూబాబాద్ 14
మంచిర్యాల 38
మెదక్ 26
మేడ్చెల్ మల్కాజిగిరి 172
ములుగు 10
నాగర్ కర్నూలు 16
నల్లగొండ 54
నారాయణపేట 12
నిర్మల్ 21
నిజామాబాద్ 23
పెద్దపల్లి 62
రాజన్న సిరిసిల్ల 43
రంగారెడ్డి 162
సంగారెడ్డి 107 
సిద్ధిపేట62
సూర్యాపేట 36
వికారాబాద్ 18
వనపర్తి 26
వరంగల్ రూరల్ 24
వరంగల్ అర్బన్ 87
యాదాద్రి భువనగిరి 11
మొత్తం 1897

 

PREV
click me!

Recommended Stories

Tirupati: రూ. 1000 లోపే హైదరాబాద్ టు తిరుపతి టూర్‌ ప్లాన్.. అవును ఇలా చేస్తే సాధ్య‌మే
Weather Update: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. మరోవైపు సూపర్ ఎల్‌నినో, వడదెబ్బల ముప్పు !