హైదరాబాదులో కరోనా తగ్గుముఖం: తెలంగాణలో 80 వేలు దాటిన కేసులు

Published : Aug 10, 2020, 09:26 AM IST
హైదరాబాదులో కరోనా తగ్గుముఖం: తెలంగాణలో 80 వేలు దాటిన కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి సాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 80 వేల మార్కును దాటింది. జిహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో వేయికి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 1256 కేసులు రికార్డయ్యాయి. దీంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య 80751కి పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా కరోనా వల్ల 10 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 637కు చేరుకుంది.  

హైదరాబాదులో కరోనా కాస్తా ఊరటనిచ్చింది. గత 24 గంటల్లో 389 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. గతంలో 500కు మించి కొన్నిసార్లు, 400కు మించి కొన్నిసార్లు జిహెచ్ఎంసి పరిధిలో కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా 400కు దిగువన  కేసులు నమోద్యయాయి. కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో కేసులేమీ నమోదు కాలేదు. 

రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కూడా నిన్నటి కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 34 కేసులు మాత్రమే నమోద్యాయి. రంగారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో 86 కేసులు రికార్డయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 67 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 63
భద్రాద్రి కొత్తగూడెం 7
జిహెచ్ఎంసి 389
జగిత్యాల 13
జనగామ 20
జయశంకర్ భూపాలపల్లి 6
జోగులాంబ గద్వాల 14
కామారెడ్డి 8
కరీంనగర్ 73
ఖమ్మం 28
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 0
మహబూబ్ నగర్ 21
మహబూబాబాద్ 19
మంచిర్యాల 11
మెదక్ 9
మేడ్చెల్ మల్కాజిగిరి 34
ములుగు 3
నాగర్ కర్నూలు 38
నల్లగొండ 58
నారాయణపేట 12
నిర్మల్ 19
నిజామాబాద్ 33
రాజన్న సిరిసిల్ల 31
రంగారెడ్డి 86
సంగారెడ్డి 74
సిద్ధిపేట 45
సూర్యాపేట 20
వికారాబాద్ 6
వనపర్తి 12
వరంగల్ రూరల్ 11
వరంగల్ అర్బన్ 67
యాదాద్రి భువనగిరి 3
మొత్తం 1256

 

PREV
click me!

Recommended Stories

Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu