ఊరటనిచ్చేలా కరోనా బులెటిన్...తెలంగాణలో పాజిటివ్ కేసుల కంటే రికవరే అధికం

By Arun Kumar P  |  First Published Sep 27, 2020, 9:26 AM IST

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతున్నా కాస్త ఊరటనిచ్చే విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 


హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,967 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,85,833కి చేరింది. మరోవైపు తాజాగా నమోదయిన పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులే అధికంగా వుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. శనివారం ఒక్కరోజే దాదాపు 2,058 మంది కరోనా నుండి కోలుకుని  డిశ్చార్జయ్యారు. 

ఇక  కరోనాతో తాజాగా 9 మంది మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1100కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా  30వేల పైచిలుకు యాక్టివ్ కేసులున్నాయని తాజా ప్రకటన తెలియజేసింది. మొత్తంగా ఇప్పటివరక 1,54,499 మంది ఈ వైరస్ బారినుండి బయటపడటంతో దేశవ్యాప్త రికవరీ రేటు కంటే రాష్ట్ర  రికవరీ రేటే అధికంగా వుంది. జాతీయస్థాయి రికవరీ రేటు 82.39 శాతంగా వుంటే తెలంగాణలో అది 83.13శాతంగా వుంది. 

Latest Videos

undefined

ఇక శనివారం ఒక్కరోజే మొత్తం 50వేల పైచిలుకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 28,50,869కి చేరింది. హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో కూాడా టెస్టుల సంఖ్యను పెంచింది ప్రభుత్వం. 

ఇక జిల్లాల వారిగా చూసుకుంటే హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా కొన్ని జిల్లాలో కేసుల సంఖ్య పెరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో కేవలం 297 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవగా కరీంనగర్ లో 152, మేడ్చల్ లో 137, రంగారెడ్డి 147, నల్గొండ 105, భద్రాద్రి 91, వరంగల్ అర్బన్ జిల్లాలో 89 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య కాస్త తక్కువగానే వుంది. 

click me!