గాంధీ హాస్పిటల్‌లో డెడీ బాడీ మారడం కలకలం రేపుతోంది. బేగంపేట గురుమూర్తి నగర్‌కు చెందిన వ్యక్తి కరోనాతో మరణించాడు. ఒక మృతదేహం బదులు మరో మృతదేహాన్ని మృతుడి కుటుంబసభ్యులకు అందజేయడంతో వారు అంత్యక్రియల కోసం స్మశానానికి తీసుకెళ్లారు
గాంధీ హాస్పిటల్‌లో డెడీ బాడీ మారడం కలకలం రేపుతోంది. బేగంపేట గురుమూర్తి నగర్‌కు చెందిన వ్యక్తి కరోనాతో మరణించాడు. ఒక మృతదేహం బదులు మరో మృతదేహాన్ని మృతుడి కుటుంబసభ్యులకు అందజేయడంతో వారు అంత్యక్రియల కోసం స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ మృతుడు తమ వ్యక్తి కాదని కుటుంబసభ్యులు గుర్తించారు.
దీంతో మృతదేహాన్ని పోలీసులు తిరిగి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మార్చురీలో భర్త శవాన్ని భార్య గుర్తుపట్టడంతో వైద్యులతో మృతుడి బంధువులు వాగ్వాదానికి దిగారు. తమపై దాడి చేయడంతో వైద్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ బైఠాయించారు.
undefined
Aslo Read:తెలంగాణలో 4 వేలకు చేరువలో కరోనా కేసులు: కొత్తగా 178 మందికి పాజిటివ్, ఆరుగురి మృతి
వైద్య సిబ్బందిపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్లు, నర్సులు డిమాండ్ చేస్తున్నారు. రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ ఆస్పత్రిలో వైద్యుడిపై ఇంతకుముందే ఒకసారి దాడి జరిగిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ఇప్పటివరకు 153 మంది వైద్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.