తెలంగాణలో కరోనా వైరస్ కేసుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. ఓ రోజు తక్కువ కేసులు వచ్చాయి అనుకునేలోపే మరో రోజు భారీగా కేసులు వెలుగు చూస్తుండటం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. ఓ రోజు తక్కువ కేసులు వచ్చాయి అనుకునేలోపే మరో రోజు భారీగా కేసులు వెలుగు చూస్తుండటం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
తాజాగా మంగళవారం కొత్తగా 178 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. వీటితో కలిపి తెలంగాణలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 3,920కి చేరింది. ఇవాళ వైరస్ కారణంగా ఆరుగురు మరణించడంతో, మొత్తం మృతుల సంఖ్య 148కి చేరింది.
undefined
మంగళవారం ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 143 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత రంగారెడ్డిలో 15, మేడ్చల్ 10, మహబూబ్‌నగర్, సంగారెడ్డిలలో రెండేసి కేసులు, జగిత్యాల, అసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,030 యాక్టివ్ కేసులు ఉండగా, 1,742 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సామాజిక కార్యకర్త, సునీత కృష్ణన్... తెలంగాణాలో లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిల్ ను హై కోర్టు తోసిపుచ్చింది. తాము ప్రభుత్వ విధానాల విషయంలో జోక్యం చేసుకోలేము అని తెలిపింది.
తెలంగాణాలో కేసులు ఎక్కువవుతున్నందున ప్రజల ఆరోగ్యం, ప్రాణాల దృష్ట్యా లాక్ డౌన్ ను పొడిగించాలని ఆమె హై కోర్టును కోరింది. కోర్టు ఈ రోజు మధ్యాహ్నం దీనిపై విచారణ జరిపి దాన్ని కొట్టేసింది. .
తెలంగాణాలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. దేశంలో లాక్ డౌన్ విధించేకన్నా ముందే తెలంగాణలో లాక్ డౌన్ విధించినప్పటికీ..... కేసులు కంట్రోల్ కాకపోగా అవి అంతకంతకు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ ని ఎత్తివేసిన దగ్గరి నుండి రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. గాంధీ ఆసుపత్రి కూడా దాపుగా ఫుల్ అయినట్టు సమాచారం.