తెలంగాణ కరోనా అప్ డేట్: హైదరాబాద్ లో మళ్లీ సెంచరీకొట్టిన పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Mar 23, 2021, 10:07 AM ISTUpdated : Mar 23, 2021, 10:09 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: హైదరాబాద్ లో మళ్లీ సెంచరీకొట్టిన పాజిటివ్ కేసులు

సారాంశం

ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 68,171మందికి కరోనా టెస్టులు చేయగా 412మందికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.  

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో(ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 68,171మందికి కరోనా టెస్టులు చేయగా 412మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,867కు చేరితే టెస్టుల సంఖ్య 97,18,833కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 216మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,99,042కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,151 యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 1,285గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1674కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 98.41శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 7, నాగర్ కర్నూల్ 7, జోగులాంబ గద్వాల 2,  కామారెడ్డి 10, ఆదిలాబాద్ 10, భూపాలపల్లి 4, జనగామ 7, జగిత్యాల 9, అసిఫాబాద్ 5, మహబూబ్ నగర్ 9, మహబూబాబాద్ 3, మెదక్ 6, నిర్మల్ 32, నిజామాబాద్ 18,  సిరిసిల్ల 4, వికారాబాద్ 7, వరంగల్ రూరల్ 4,  ములుగు 4, పెద్దపల్లి 7, సిద్దిపేట 8, సూర్యాపేట 8, భువనగిరి 10, మంచిర్యాల 9, నల్గొండ 11 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 101కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 31, రంగారెడ్డి 27, కొత్తగూడెం 6, కరీంనగర్ 12, ఖమ్మం 11,  సంగారెడ్డి 8, వరంగల్ అర్బన్ 12కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:            

                                                         
                                    

PREV
click me!

Recommended Stories

IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu