డిప్రెషన్ : 23వ అంతస్తునుంచి దూకి.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య...

By AN TeluguFirst Published Mar 23, 2021, 9:41 AM IST
Highlights

మానసిక ఒత్తిడి మనిషి ప్రాణాలు తీసేస్తుంది. రోజురోజుకూ ఈ కారణంతో ఆత్మహత్యలు చేసుకునేవారు ఎక్కువవుతున్నారు. తాజాగా హైదరాబాద్, గచ్చిబౌలిలో ఓ ఇంటర్ విద్యార్థిని తీవ్రమానసిక ఒత్తిడి తట్టుకోలేక 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

మానసిక ఒత్తిడి మనిషి ప్రాణాలు తీసేస్తుంది. రోజురోజుకూ ఈ కారణంతో ఆత్మహత్యలు చేసుకునేవారు ఎక్కువవుతున్నారు. తాజాగా హైదరాబాద్, గచ్చిబౌలిలో ఓ ఇంటర్ విద్యార్థిని తీవ్రమానసిక ఒత్తిడి తట్టుకోలేక 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

సీఐ గోనె సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నానక్ రాం గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ‘మంత్రి సెలస్టియ’ అపార్ట్ మెంట్ ఎఫ్ బ్లాక్ లోని 23వ అంతస్తులో ఇష రంజన్ (17), తల్లి మౌనిక సిన్హా, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటోంది. 

జూబ్లీహిల్స్‌లో శ్రీచైతన్య కాలేజీలో ఎంపీసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు బాల్కనీలో చెప్పులు ఒదిలి, స్టూల్ ఎక్కి అక్కడినుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. అంత ఎత్తునుంచి పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 

ఇషా పడిన శబ్దానికి వాచ్ మెన్ వచ్చి చూసి వెంటనే విషయాన్ని తల్లికి తెలిపాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కాగా, భార్యాభర్తలైన మౌనిక సిన్హా, సికెష్‌ రంజన్‌లు 2015లో విడాకులు తీసుకున్నారు. మౌనిక సిన్హా కూతురుతో కలిసి ఇక్కడే ఉంటుంది. సికెష్ రంజన్ మాత్రం అమెరికా వెళ్లిపోయాడు. 

ఇషా రంజన్ కొద్ది కాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. కొద్ది నెలల కిందట నిద్రమాత్రలు మింగి, బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. మార్చి  7వ తేదీ నుంచి ఇప్పటి వరకు మిస్ అవుతున్నానని చెబుతూ స్నేహితులకు ఏడు లెటర్లు రాసింది. 

తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తల్లికి ‘మామ్ సారీ.. ప్లీజ్ గివ్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్’  అని సూసైడ్‌ నోట్‌ రాసింది. స్నేహితులకు రాసిన లేఖలతో పాటు సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇషా రంజన్ తీవ్ర ఒత్తిడికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!