తెలంగాణలో లాక్‌డౌన్: స్వంత ఊళ్లకు జనం పయనం, నిత్యావసరాల కోసం రోడ్లపైకి ప్రజలు

Published : May 12, 2021, 09:25 AM ISTUpdated : May 12, 2021, 09:34 AM IST
తెలంగాణలో లాక్‌డౌన్: స్వంత ఊళ్లకు జనం పయనం, నిత్యావసరాల కోసం రోడ్లపైకి  ప్రజలు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుండి  లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 10 గంటల వరకు  నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు  ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో  నిత్యావసర సరుకుల కోసం జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుండి  లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 10 గంటల వరకు  నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు  ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో  నిత్యావసర సరుకుల కోసం జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. మంగళవారం నాడు  మధ్యాహ్నం కేబినెట్ సమావేశంలో పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  పది రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.  ఈ నెల 20వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లాక్‌డౌన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా లాక్‌డౌన్ ప్రకటన చేయడంతో తమకు కావాల్సిన సరుకులు ఇతరత్రా వస్తువుల కోసం ప్రజలు ఉదయం నుండే రోడ్లపైకి వచ్చారు. 

also read:తెలంగాణలో లాక్‌డౌన్: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే.. డీజీపీ హెచ్చరిక

లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇతర రాష్ట్రాలకు చెందినవారు నిన్నటి నుండే తమ ప్రాంతాలకు బయలుదేరారు. ఇవాళ ఉదయం నుండి కూడ చాలా మంది తమ స్వంత ఐళ్లకు బయలుదేరారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద  వాహనాల రద్దీ నెలకొంది. ప్రతి రోజూ నాలుగు గంటలపాటు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి రోజూ  20 గంటల పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.  లాక్‌డౌన్ అమలు చేయడం ద్వారా  కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చనే  అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!