కరోనా ఎఫెక్ట్: ఉచితంగా కోళ్ల పంపిణీ, ఎగబడ్డ జనం

Published : Mar 19, 2020, 04:58 PM IST
కరోనా ఎఫెక్ట్:  ఉచితంగా కోళ్ల పంపిణీ, ఎగబడ్డ జనం

సారాంశం

చికెన్ తినడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ఓ పౌల్ట్రీ యజమాని తన ఫాంలో ఉన్న 5300 కోళ్లను ఉచితంగా పంచి పెట్టారు. 


సిద్దిపేట: చికెన్ తినడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ఓ పౌల్ట్రీ యజమాని తన ఫాంలో ఉన్న 5300 కోళ్లను ఉచితంగా పంచి పెట్టారు. 

Also read:'చికెన్‌తో కరోనా అని నిరూపిస్తే రూ. 5 కోట్ల బహుమతి'

మెదక్ జిల్లాలోని వెల్దుర్తి పట్టణానికి చెందిన పౌల్ట్రి యజమాని ఉచితంగా కోళ్లను పంచిపెట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెర్వపూర్ కు చెందిన పౌల్ట్రి యజమాని పిల్టా స్వామి  ఉచితంగా కోళ్లను పంచి పెట్టారు. రెండు వేల కోళ్లను ఆయన దుబ్బాకకు తీసుకెళ్లి ఉచితంగా పంచి పెట్టారు. 

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్ పూర్ కు చెందిన బంజ శ్రీశైలం, కల్లూరి వెంకటమ్మలు తమ ఫాంలో కోళ్లను కొనుగోలు చేసే వారు లేకపోవడంతో 10 వేల కోళ్లను జేసీబీతో గుంతలు తీసి పూడ్చి పెట్టారు.

చికెన్ , కోడిగుడ్లు తింటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీని ప్రభావంతో చికెన్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చికెన్ కిలో రూ. 50లకు తగ్గింది. కోడిగుడ్ల ధర కూడ తగ్గింది.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?