ఓయూలో కరోనా డెత్: ఉద్యోగుల భయాందోళనలు, రిజిస్ట్రార్ వాదన ఇదీ...

By Sree s  |  First Published Jun 10, 2020, 9:41 PM IST

తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని టెక్నాలజీ కాలేజీలో ప్రకాష్ అనే ఒక కామాటి కరోనా వైరస్ కారణంగా మరణించాడు. తమ సహోద్యోగి మరణించడంతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా వైరస్ సోకిన తరువాత ఆ సదరు ఉద్యోగి యూనివర్సిటీకి కూడా హాజరయ్యాడు.


తెలంగాణాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజురోజుకి కేసుల సంఖ్యతోపాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని టెక్నాలజీ కాలేజీలో ప్రకాష్ అనే ఒక కామాటి కరోనా వైరస్ కారణంగా మరణించాడు. 

తమ సహోద్యోగి మరణించడంతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా వైరస్ సోకిన తరువాత ఆ సదరు ఉద్యోగి యూనివర్సిటీకి కూడా హాజరయ్యాడు. అతడు యూనివర్సిటీకి మూడవ తారీఖున చివరిసారిగా హాజరయ్యాడు. ఆ తరువాత అతడు గాంధీలో చేరడం కారొనతో మరణించడం జరిగాయి. 

Latest Videos

undefined

ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ సదరు ఉద్యోగి స్వీపర్ అయినందువల్ల యూనివర్సిటీకి వచ్చిన తరువాత కూడా రూములను ఊడ్చాడని, దానితోపాటుగా అతడు వేరే ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చు, ఇతర ఉద్యోగులతో కలిసి ఉండవచ్చు అని అంటున్నారు. 

ఏదో నామ్ కె వాస్తే మాత్రమే థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారని, అది కూడా ఒకటి రెండు రోజులుగా మాత్రమే చేస్తున్నారని అంటున్నారు. యూనివర్సిటీలో ఒక్క ఉద్యోగికి అతడివల్ల కరోనా వైరస్ సోకినా కూడా అది అందరికీ వ్యాపించే ఆస్కారముందని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి ఏషియా నెట్ న్యూస్ తో మాట్లాడుతూ...అతడి లాస్ట్ అటెండన్స్ యూనివర్సిటీలో నమోదయి ఇప్పటికే వారం రోజులు దాదాపుగా అయిందని, అతడు వచ్చినరోజు కూడా యూనివర్సిటీలో కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంది వెళ్లిపోయాడని అన్నారు. తాము ఇప్పటికే ఆ టెక్నాలజీ బిల్డింగ్ మొత్తాన్ని శానిటైజ్ చేశామని అన్నారు. 

టెక్నాలజీ కాలేజీ ప్రిన్సిపాల్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.... బిల్డింగ్ ని ఇప్పటికే రెండుసార్లు శానిటైజ్ చేశామని, రేపు కూడా మరోసారి చేస్తామని అన్నారు. ఆదివారం వరకు టెక్నాలజీ కాలేజీ ని మూసేశామని తెలిపారు. 

మరణించిన వ్యక్తి కాలేజీ కి వచ్చి కూడా ఆరు రోజులు పూర్తయింది కాబట్టి మిగిలిన ఉద్యోగులకు ప్రమాదం ఉండకపోవచ్చు అన్న రిజిస్ట్రార్ మాటలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. 

డిఫెన్సివ్ గా మాట్లాడుతున్నారే తప్ప... ఉద్యోగుల ప్రాణాల గురించి కరెక్ట్ గా ఆలోచించడంలేదని వారు అంటున్నారు. అతడు వేరే ఏ ఉద్యోగిని కలిసినా  వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. అందుకోసమే మేము ఒక వారం రోజుల పాటు ఉద్యోగులకు సెలవు ప్రకటించి మొత్తం క్యాంపస్ ని శానిటైజ్  కోరుతున్నట్టుగా తెలిపారు. 

click me!