తెలంగాణలో 417 కొత్త కరోనా కేసులు

Published : Jan 06, 2021, 10:03 AM IST
తెలంగాణలో 417 కొత్త కరోనా కేసులు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 43,318 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 417 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,88, 410కి చేరింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. 

నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,556కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 472 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,81, 872కి చేరింది. 

రాస్ట్రంలో ప్రస్తుతం 4,982 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 2,748 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్యం 71,04,367కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
PREV
click me!

Recommended Stories

Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?
Musi Riverfront Project: మూసీ నది ఒడ్డున రూ.1,108 కోట్లుతో ఓంకారేశ్వరాలయం