తెలంగాణలో హఠాత్తుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. చర్యలు తీసుకోండి: ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

By Mahesh KFirst Published Mar 16, 2023, 8:08 PM IST
Highlights

తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు హఠాత్తుగా పెరిగిపోతున్నాయని, వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు లేఖ రాసింది.
 

హైదరాబాద్: కరోనా కేసులు హఠాత్తుగా పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించడంపై ఫోకస్ పెట్టాలని తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు లేఖ రాసింది. టెస్టింగ్, ట్రీటింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది.

‘కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ స్థానికంగా కేసులు హఠాత్తుగా పెరుగుతున్నాయనే సంకేతాలను ఈ సంఖ్యలు ఇస్తున్నాయి. కాబట్టి, స్థానికంగా కేసులు ప్రబలకుండా నివారణ, కట్టడి చర్యలు తీసుకోవాలి. కరోనా పై పోరులో మనం సాధించిన విజయాలు నిష్ఫలం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని కేంద్రం తెలిపింది. 

‘రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఏ ఏరియాల్లోనైనా కేసులు వేగంగా రిపోర్ట్ అవుతున్నాయంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. మైక్రో లెవల్‌లో అంటే జిల్లా స్థాయిలో, సబ్ డిజిస్ట్రిక్‌ స్థాయిలో నియంత్రణ చర్యలను తీసుకోవాలి’ అని వివరించింది.

బుధవారం కరోనా కేసులు 700 మార్క్‌ను దాటాయి. నాలుగు నెలల తర్వాత తొలిసారి ఈ స్థాయిలో (734) కేసులు రిపోర్ట్ అయ్యాయి. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలు వెల్లడించింది.

Also Read: పేపర్ లీక్‌.. టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం, ఏప్రిల్‌లో జరిగే పరీక్షల ప్రశ్నాపత్రాలు మార్పు

ఇదిలా ఉండగా బుధవారం తెలంగాణలో కొత్తగా 54 కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇందులో 40 కేసులు రాజధాని నగరంలోనే నమోదయ్యాయి. అంతకు క్రితం రోజు అంటే మంగళవారం మన రాష్ట్రంలో 52 కేసులు నమోదు కాగా.. అందులో 30 కేసులు హైదరాబాద్‌లోనివే కావడం గమనార్హం.

click me!