తెలంగాణలో కరోనా కేసుల్లో 56 శాతం పెరుగుదల: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

Published : Jun 10, 2022, 04:27 PM ISTUpdated : Jun 10, 2022, 04:37 PM IST
తెలంగాణలో కరోనా కేసుల్లో 56 శాతం పెరుగుదల: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

సారాంశం

తెలంగాణలో 56 శాతం కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైందని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. డిసెంబర్ వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని ఆయన చెప్పారు. 

హైదరాబాద్: Telangana లో 56 శాతం కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ Srinivasa Raoచెప్పారు. శుక్రవారం నాడు Hyderabad  లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో Corona  కేసుల సంఖ్య 66 శాతంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో కరోనా ఇంకా పూర్తిగా పోలేదన్నారు. డిసెంబర్ వరకు ఇలాగే ఉంటుందన్నారు.  జ్వరం, తలనొప్పి, వాసన లేకంటే వెంటనే  Test చేయించుకోవాలని సూచించారు.తెలంగాణలో వారంలో 811 కరోనా కేసులు  నమోదైనట్టుగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆయన కోరారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని అయితే ఆందోళన అవసరం లేదన్నారు.  కరోనాతో ఆస్పత్రుల్లో చేరికలు లేవన్నారు. మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదని ఆయన వివరించారు. రాష్ట్రంలో గత వారం 355 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ వారంలో 555 కేసులు నమోదు అయ్యాయని ఆయన గుర్తు చేశారు. 
 త్వరలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్‌ చేపట్టబోతున్నామన్నారు.12-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ అందుబాటులోనే ఉందని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు.

థర్డ్ వేవ్ లో ఒమ్రికాన్ కేసులు భారీగా వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టాయన్నారు. మళ్లీ గత రెండు వారాలుగా కొత్త కేసుల్లో పెరుగుదల కన్పిస్తుందని ఆయన వివరించారు. గత మూడు రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు 100కి పైగా నమోదౌతున్నాయని ఆయన చెప్పారు. రెండున్నర నెలల తర్వాత మళ్లీ కేసుల్లో పెరుగుదల కన్పిస్తుందని శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నప్పటికీ పోర్త్ వేవ్ వచ్చే  అవకాశాలు చాలా తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయడం వల్ల ఇమ్యూనిటీ పెంచుకున్నామన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu
Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ