
తెలంగాణ గవర్నర్ (telangana governor) తమిళిసై సౌందరరాజన్ (tamilisai soundararajan) రాజ్‌భవన్‌లో నిర్వహించిన మహిళా దర్బార్ (mahila darba) వ్యవహారం తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనిపై టీఆర్ఎస్ (trs) , బీజేపీ (bjp) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) సైతం స్పందించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. గవర్నర్ మహిళా దర్బార్ పెట్టడం వెనుక బీజేపీ, మోడీ వున్నారని ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్‌లోనే మహిళా దర్భార్ జరిగిందని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ జిల్లాకు వెళ్తే కలెక్టర్, ఎస్పీ రాలేదని .. ఆ అధికారుల మీద చర్యలే తీసుకోలేదని ఆయన ఆరోపించారు. అలాంటప్పుడు మహిళలకు ఏం న్యాయం చేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
కాగా.. సుమారు 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు Mahila Darbar కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా మహిళలు చెప్పుకున్న బాధలను గవర్నర్ విన్నారు. సీరియస్ కేసులకు సంబంధించిన బాధలను గవర్నర్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని పరోక్షంగా కేసీఆర్ సర్కార్ కు ఆమె చురకలంటించారు.
Also Read:నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు: మహిళా దర్బార్ లో గవర్నర్ తమిళిసై
రాజ్ భవన్ ఎలాంటి హద్దులు దాటడం లేదని స్పష్టం చేశారు. రాజ్ భవన్ ను గౌరవించకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నామని... ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని తమిళిసై అభిప్రాయపడ్డారు. గ్యాంగ్ రేప్ ఘటనలో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని ఆమె చెప్పారు. మహిళలు సమాజంలో బాధపడుతున్న సమయంలో వారిని ఆదుకొనేందుకు తాను ముందుంటానన్నారు.