తెలంగాణ కరోనా అప్ డేట్: హైదరాబాద్ లోనే మళ్లీ... సెంచరీకి చేరువలో పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Mar 22, 2021, 10:40 AM ISTUpdated : Mar 22, 2021, 10:46 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: హైదరాబాద్ లోనే మళ్లీ... సెంచరీకి చేరువలో పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు 37.079మందికి కరోనా టెస్టులు చేయగా 337మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో(శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 37.079మందికి కరోనా టెస్టులు చేయగా 337మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరితే టెస్టుల సంఖ్య 96,50,662కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 181మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,98,826కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,958 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 1,226గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1671కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 98.47శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 3, నాగర్ కర్నూల్ 4, జోగులాంబ గద్వాల 4,  కామారెడ్డి 3, ఆదిలాబాద్ 8, భూపాలపల్లి 0, జనగామ 4, జగిత్యాల 8, అసిఫాబాద్ 0, మహబూబ్ నగర్ 9, మహబూబాబాద్ 4, మెదక్ 5, నిర్మల్ 18, నిజామాబాద్ 11,  సిరిసిల్ల 8, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 5,  ములుగు 1, పెద్దపల్లి 5, సిద్దిపేట 6, సూర్యాపేట 5, భువనగిరి 3, మంచిర్యాల 8, నల్గొండ 8 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 91కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 28, రంగారెడ్డి 37, కొత్తగూడెం 4, కరీంనగర్ 10, ఖమ్మం 9,  సంగారెడ్డి 12, వరంగల్ అర్బన్ 7కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 


 

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026 : తెలంగాణకు 7, ఏపీకి 4 పద్మ అవార్డులు.. ఆ 11 మంది ఎవరంటే?
Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu