గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. వరంగల్- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఓటమి పాలు కావడంతో మనస్తాపం చెందిన ఓ 21 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. వరంగల్- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఓటమి పాలు కావడంతో మనస్తాపం చెందిన ఓ 21 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఈ శ్రీశైలం అనే యువకుడు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఎన్నికల్లో విపరీతంగా కష్టపడ్డాడు. అయితే ఆయన ఓటమి పాలు కావడంతో తట్టుకోలేక ఆదివారం నాడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
ఆదివారం నాడు తన ఇంటికి సమీపంలో ఉన్న గుడిసెలోకి వెళ్లి విషం తాగాడు. అయితే శ్రీశైలం కదలికలపై అనుమానపడ్డ కుటుంబ సభ్యులు అతన్ని కనిపెట్టే ఉంటున్నారు. గుడిసెలోకి వెళ్లిన కాసేపటికి వారూ అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే అతను విషం తాగేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అక్కడి చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
అయితే, శ్రీశైలం కుటుంబ సభ్యులు మాత్రం మల్లన్న ఓడిపోవడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని ఖండించారు. పనీ,పాటా లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడని కుటుంబసభ్యులు మదలించడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వారు చెబుతున్నారు. అంతేకాదు ఉద్యోగం చూసుకోకుండా రాజకీయాల్లో చురుకుగా తిరుగుతున్నాడని కొప్పడడంతో మనస్తాపంతో ఇంత పని చేశాడని అంటున్నారని మర్రిగూడ సబ్ ఇన్స్ పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు.
తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న శ్రీశైలం.. చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి సహాయంగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.