తెలంగాణ లో కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

Published : Dec 12, 2020, 10:09 AM IST
తెలంగాణ లో కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

సారాంశం

నిన్న కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1489కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 564మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,67,992కి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  శుక్రవారం రాత్రి 8గంటల వరకు 52,308 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 635 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,77,151 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

నిన్న కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1489కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 564మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,67,992కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,670 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. వారిలో 5,557 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 60,81,517కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 141 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం