వరంగల్ గొర్రెకుంట బావి కేసులో.. మరో తీర్పు

Published : Dec 12, 2020, 08:37 AM IST
వరంగల్ గొర్రెకుంట బావి కేసులో.. మరో తీర్పు

సారాంశం

దోషి సంజయ్ కుమార్ జీవించి ఉన్నంతకాలం జైల్లోనే ఉండాలని వరంగల్ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావూరి జయకుమార్ తీర్పు వెల్లడించారు.  

వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన గొర్రెకుంట బావి కేసు( ఒకే కుటుంబానికి చెందిన 9మంది దారుణ హత్య) లో వరంగల్ పోక్సో కోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది.

ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని హతమార్చి బావిలో జలసమాధి చేసిన కేసులో ఉరిశిక్ష పడిన సంజయ్ కుమార్ కి మరో కేసులో వరంగల్ పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషి సంజయ్ కుమార్ జీవించి ఉన్నంతకాలం జైల్లోనే ఉండాలని వరంగల్ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావూరి జయకుమార్ తీర్పు వెల్లడించారు.

హత్యకు గురైన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై సంజయ్ అత్యాచారానికి పాల్పడినట్లు నిర్థారణ కావడంతో కోర్టు జీవిత ఖైదు ఆదేశించింది.  బాధిత బాలికకు పరిహారంగా రూ.4లక్షలు అందించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇటువంటి కేసుల్లో ఇంత పెద్ద మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించడం దేశంలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu