మజ్లిస్‌కు కాంగ్రెస్ రూ.25 లక్షల ఆఫర్ (ఆడియో)

By narsimha lodeFirst Published Nov 20, 2018, 5:10 PM IST
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఎంఐఎం సభ నిర్వహించకుండా ఉండేందుకు గాను  రూ. 25 లక్షలు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినట్టుగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్  సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఎంఐఎం సభ నిర్వహించకుండా ఉండేందుకు గాను  రూ. 25 లక్షలు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినట్టుగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్  సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.నిర్మల్ లో ఎంఐఎం సభ నిర్వహించకుండా ఉండేందుకు గాను ఎంఐఎంకు  రూ. 25 లక్షలను ఆయన ఆఫర్ చేసినట్టు అసద్ నిర్మల్ సభలో  వ్యాఖ్యలు చేశారు.

అయితే  నిర్మల్ నుండి  కాంగ్రెస్ అభ్యర్థిగా  బరిలో ఉన్న మహేశ్వర్ రెడ్డి  అసద్ కు ఈ ఆఫర్ చేసినట్టు ప్రచారం సాగింది. తాను అసద్‌తో ఫోన్ లో మాట్లాడలేదని.. అసద్ ను టీవీల్లో, పేపర్లో తప్ప ప్రత్యక్షంగా చూడలేదని నిర్మల్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

కానీ, ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పవార్ పటేల్ కు ఎంఐఎం నేత, భైంసా  మున్సిఫల్ వైస్ ఛైర్మెన్ జబీర్ అహ్మద్ మధ్య సాగినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన ఆడియో లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిర్మల్ సభ పెట్టకూడదని స్పష్టంగా కోరినట్టు ఆడియోను బట్టి తెలుస్తోంది.

మరోవైపు ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పవార్ పటేల్, భైంసా మున్సిఫల్ వైఎస్ ఛైర్మెన్‌కు మధ్య జరిగిన ఆడియో సంభాషణ నిజంగా వారిద్దరి మధ్యే జరిగిందా.... లేక వారి పేరుతో మరేవరైనా మాట్లాడారా అనేది తేలాల్సి ఉంది. ఈ ఆడియో సంభాషణ ఎంత వరకు నిజమైందో తేలాల్సి ఉంది.

ఈ ఆడియో సంభాషణను వినండి

              "

సంబంధిత వార్తలు

అసద్‌కు మహేశ్వర్ రెడ్డి కౌంటర్: నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా

రూ.25 లక్షల ఆఫర్: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ సంచలన ఆరోపణలు

click me!