
వారికి పెళ్లై కేవలం 15నెలలు మాత్రమే అవుతోంది. కానీ.. అంతలోనే వారు పిల్లలు కావాలని అనుకున్నారు. అయితే.. వారికి 15 నెలలు గడుస్తున్నా సంతానం కలగలేదు. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే భార్యభర్తలు తరచూ గొడవలుపడుతూనే ఉన్నారు. ఈ గొడవతో మరింత మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఓ కానిస్టేబుల్ కావడం గమనార్హం. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నేషనల్ పోలీస్ అకాడమీలో వాసు(30) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి 15 నెలల కిందట వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి అతను పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ వారికి సంతానం కలగడం లేదు. సంతానం కలగడం లేదని తరుచూ భార్యాభర్తల మధ్య గొడవజరుగుతుంది.
ఇదే విషయమై ఆదివారం రాత్రి ఇరువురి మధ్య మరోసారి గొడవయింది. రాత్రి 9గంటల ప్రాంతంలో ఇరువురు నిద్రకు ఉపక్రమించారు.11గంటల ప్రాంతంలో నీలిమకు మెలుకువ రావడంతో బెర్రంలో చూడగా వాసు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె విషయాన్ని కుటుంబ సభ్యు కు, చుట్టు పక్కల వారికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.