అవిభక్త కవలలు వీణా.. వాణీ: డైలీ షెడ్యూల్ ఇదే..!

By narsimha lodeFirst Published Oct 16, 2018, 1:08 PM IST
Highlights

అవిభక్త కవలలు వీణా.. వాణీలు   తోటి స్నేహితులతో  కలిసి సరదాగా ఆడుకొనే వయస్సులో  ఆసుపత్రులకే పరిమితమయ్యారు.


హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా.. వాణీలు   తోటి స్నేహితులతో  కలిసి సరదాగా ఆడుకొనే వయస్సులో  ఆసుపత్రులకే పరిమితమయ్యారు. ప్రస్తుతం స్టేట్‌హోమ్ ‌లో  అవిభక్త కవలలు ఉంటున్నారు.

సుదీర్ఘ కాలం పాటు  నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న  వీణా.. వాణీలు ఏడాది క్రితం యూసుఫ్‌గూడ స్టేట్ హోం లో గడుపుతున్నారు.ఉదయం ఆరు గంటలకు  వీరిద్దరూ నిద్రలేస్తారు. నిద్రలేచిన తర్వాత వాకింగ్, వ్యాయామం చేస్తారు. స్నానం చేసి  క్లాసులకు రెడీ అవుతారు.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు  క్లాసుల్లో ఉంటారు.  క్లాసులు పూర్తైన తర్వాత హోం వర్క్ పూర్తి చేస్తారు. రాత్రి 10 గంటలకు నిద్రపోతారు.హోంవర్క్ పూర్తైన తర్వాత టీవీలో వార్తలు, సీరియల్స్ చూస్తామని వీణా.. వాణీలు  చెబుతున్నారు.  ప్రస్తుతం 8వ, తరగతి చదువుకొంటున్నారు.

తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వారితో మాట్లాడుతారు. నీలోఫర్ ఆసుపత్రిలో పనిచేసే నర్సులు, ఆయాలు, వైద్యులతో  వీణా.. వాణీలకు  మంచి సంబంధాలు ఉన్నాయి.

ఏడాది నుండి  స్టేట్ హోంలో వీణా.. వాణీలు ఉండడంతో  నీలోఫర్‌ను చాలా మిస్ అవుతున్నట్టు చెబుతున్నారు. వీణా... వాణీలతో అనుబంధం ఉన్న నర్సులు, ఆయాలు.. అప్పుడప్పుడూ స్టేట్ హోం‌మ్ కు వచ్చి  ఆ పిల్లలను పరామర్శించి వెళ్తుంటారు. 

సంబంధిత వార్తలు

మారని స్థితి: 16 ఏట అడుగుపెట్టిన వీణా.. వాణీ

 

click me!