హైదరాబాద్ లో మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం.. ఆరుగురుమృతి

By ramya neerukondaFirst Published Oct 16, 2018, 12:57 PM IST
Highlights

వాతావరణంలో సడెన్ గా వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది జ్వరం బారిన పడుతున్నరని వైద్యులు చెబుతున్నారు. రోజురోజుకీ స్వైన్ ఫ్లూ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
 

హైదరాబాద్ లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. నగరంలో గడిచిన 15రోజుల్లో ఈ స్వైన్ ఫ్లూ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలు భయందోళనకు గురౌతున్నారు. దీనిని అదుపుచేసేందుకు  వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. 

వాతావరణంలో సడెన్ గా వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది జ్వరం బారిన పడుతున్నరని వైద్యులు చెబుతున్నారు. రోజురోజుకీ స్వైన్ ఫ్లూ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు, నీరసించిపోవడం, ఒళ్లుపై గుళ్లలు ఏర్పడటం వంటివి స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఇలాంటి లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. సంవత్సరానికి సరిపడా వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ స్వైన్ ఫ్లూ అనేది అన్ని వర్గాల వారికి వస్తుందని, ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

ఎక్కువగా నవంబర్-డిసెంబర్ నెలల్లోనే ఈ స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. రెండు నెలల క్రితంతోపోలిస్తే.. జ్వరపీడితలు ప్రస్తుతం రెట్టింపు అయినట్లు వారు చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. 

click me!