తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు.. తీవ్ర ఉద్రిక్తత..

Published : Feb 11, 2023, 02:20 PM IST
తెలంగాణ అసెంబ్లీ  ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు.. తీవ్ర ఉద్రిక్తత..

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించింది. యూత్ కాంగ్రెస్ నాయకులు, ఫిషర్ మెన్ విభాగం అసెంబ్లీ ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించింది. యూత్ కాంగ్రెస్ నాయకులు, ఫిషర్ మెన్ విభాగం అసెంబ్లీ ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసుల వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.  

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం వడ్డెర కులస్తులు కూడా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వద్ద నిరసన తెలిపేందుకు వచ్చారు. అయితే అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించినప్పటికీ.. విడతల వారీగా వడ్డెర కులస్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని.. అక్కడి నుంచి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!