టికెట్ ఆశించిన ఆ ముగ్గురు నా గెలుపునకు కృషి: పాల్వాయి స్రవంతి

By narsimha lodeFirst Published Sep 9, 2022, 3:06 PM IST
Highlights

నల్గొండ జిల్లాకు చెందిన  కాంగ్రెస్ పార్టీ సీనియర్ల ఆశీర్వాదం తీసుకొన్న తర్వాత మునుగోడులో అసెంబ్లీ ప్రచారం ప్రారంభించనున్నట్టుగా పాల్వాయి స్రవంతి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. 


హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని ఆశిస్తున్నట్టుగా పాల్వాయి స్రవంతి ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి ని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా ప్రకటించిన  విషయం తెలిసిందే.

శుక్రవారం నాడు ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కు  పాల్వాయి స్రవంతి ఇంటర్వ్యూ ఇచ్చారు.  తనకు పార్టీ టికెట్ కేటాయించినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనే తపన ఉన్న విషయాన్ని గుర్తించి తనకు టికెట్ కేటాయించి ఉండారని ఆమె అభిప్రాయపడ్డారు. 

మునుగోడులో పార్టీని గెలిపించుకొనేందుకు తన శక్తి వంచన లేకుుండా పనిచేస్తానని చెప్పారు. మునుగోడులో పార్టీ టికెట్ కోసం ముగ్గురు నేతలం పోటీపడినట్టుగా చెప్పారు. ముగ్గురిలో ఎవరికి టికెట్ వచ్చినా కూడా మిగిలినవారంతా గెలుపు కోసం పనిచేయాలని ముందే మాట్లాడుకున్నామని స్రవంతి చెప్పారు. తన గెలుపు కోసం  కృష్ణారెడ్డి కూడా పనిచేస్తారనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివన్నారు. పార్టీని గెలిపించుకోవాలనే భావన కూడా పార్టీ కార్యకర్తల్లో ఉందని ఆమె చెప్పారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లిన నాయకులతో పార్టీకి నష్టం లేదన్నారు. మొదటి నుండి పార్టీతో ఉన్నవారు  పార్టీలోనే ఉన్నారని ఆమె చెప్పారు. బీజేపీని ఓడించాలనే ఉద్దేశ్యం లెఫ్ట్ పార్టీలకు ఉందన్నారు. అయితే బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ కు మద్దతిచ్చినట్టుగా లెఫ్ట్ పార్టీలు ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ కు మద్దతిచ్చేందుకు సిద్దంగా లేరని ఆమె అభిప్రాయపడ్డారు. కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను ఓడించేందుకు గాను  మునుగోడు అసెంబ్లీ స్థానంలో క్షేత్రస్థాయిలో ఉన్న లెప్ట్ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ కే మద్దతిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

also read:మునుగోడు ఉప ఎన్నికలు 2022: కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పేరు ఖరారు

ప్రజలదీవెన ఉంటే ఎన్నికల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడ ఉపయోగం ఉండదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేసినట్టుగానే మునుగోడులో కూడ సెంటిమెంట్ కాంగ్రెస్ కి కలిసి రానుందని ఆమె తెలిపారు. గతంలో ఎందరికో అవకాశం ఇచ్చారు.  ఈ దఫా తనకు అవకాశం కల్పిస్తే మునుగోడు ప్రజలకు అందుబాటులో ఉంటానని పాల్వాయి స్రవంతి చెప్పారు. తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి  బతికున్న సమయంలో కూడా తాను పార్టీ క్యాడర్, ప్రజలకు సేవ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అధికారంలో ఉన్న లేకున్నా తాను ప్రజలకు సేవ చేసినట్టుగా ఆమె చెప్పారు.  జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ల ఆశీర్వాదం తీసుకుని మునుగోడులో ప్రచారానికి వెళ్తానని ఆమె తెలిపారు.

click me!