మినీ మున్సిపోల్స్ : జడ్చర్లలో తెరాస, లింగోజిగూడలో కాంగ్రెస్...

Published : May 03, 2021, 01:07 PM IST
మినీ మున్సిపోల్స్ : జడ్చర్లలో తెరాస, లింగోజిగూడలో కాంగ్రెస్...

సారాంశం

సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ మినీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఫలితాలు వెల్లడవుతున్నాయి. 

సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ మినీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఫలితాలు వెల్లడవుతున్నాయి. 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీని అధికార పార్టీ తెరాస కైవసం చేసుకుంది. ఇక్కడ ఇప్పటి వరకు 19 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. వీటిలో 16 వార్డుల్లో తెరాస గెలుపొందింది. ఇక్కడ మొత్తం 27 వార్డులుండగా.. అధిక స్థానాల్లో తెరాస గెలిచిి మున్సిపాలిటీపై జెండా ఎగురవేసింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం...

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి భాజాపా అభ్యర్థిపై గెలుపొందారు. 

గతేడాది డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్ లో భాజపా కార్పొరేటర్ గెలుపొందారు. ఆయన మృతి చెండటంతో ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఈ స్థానంలో పోటీకి తెరాస తమ అభ్యర్థిని నిలపలేదు. తాజా గెలుపుతో జీహెచ్ఎంసీలో 3స్థానాలకు కాంగ్రెస్ బలం పెరిగింది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?