కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి: సోనియా నాయకత్వాన్ని బలపర్చిన తెలంగాణ సీఎల్పీ

Published : Mar 16, 2022, 02:50 PM ISTUpdated : Mar 16, 2022, 03:27 PM IST
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి: సోనియా నాయకత్వాన్ని బలపర్చిన తెలంగాణ సీఎల్పీ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమాను వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశం బుధవారం నాడు హైద్రాబాద్ లో జరిగింది.

హైదరాబాద్: Congress  పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమాను వ్యక్తం చేశారు.బుధవారం నాడు Hyderabad లో Cసమావేశం జరిగింది.ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వాలను సమర్ధిస్తూ సీఎల్పీ  సమావేశం తీర్మానం చేసింది. 

పార్టీని కాపాడేందుకు Sonia Gandhi తీసుకొన్న నిర్ణయాన్ని  ఆహ్వానిస్తున్నామని సీఎల్పీ నేత Mallu Bhatti Vikramaraka చెప్పారు. Congress భావజాలాన్ని కాపాడేందుకు త్యాగాలు చేసిన కుటుంబం గాంధీలదని భట్టి విక్రమార్క చెప్పారు. గాంధీ ఫ్యామిలీ త్యాగాతోనే Kapil Sibal కేంద్రంలో మంత్రిగా పనిచేశారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.సీనియర్ నేతల సమావేశం రాహుల్ నాయకత్వంకోసమేనని ఆయన చెప్పారు.

మతతత్వ వాదనతో జాతి విచ్చిన్నం కుట్ర జరుగుతుంది. వీటిపై పోరాటానికి Rahul gandhi పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క చెప్పారు. దేశ రక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలను చేపట్టాలని కూడా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు.  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కపిల్ సిబల్  స్పంందిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి గాంధీ కుటుంబం తప్పుకోవాలని కోరారు.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించాలని జీ 23 నేతలు డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ మేరకు గత వారంలో సీడబ్ల్యుసీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఘోర పరాజయంపై చర్చించారు. మరోసారి సీడబ్ల్యూసీ భేటీ కావాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు.

2021 అక్టోబర్ మాసంలో CWC  సమావేశమైంది.  ఆ  సమావేశం తర్వాత గత ఆదివారం నాడు సీడబ్ల్యూసీ భేటీ అయింది. సీడబ్ల్యుసీలో  పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత సహా 23 మంది సభ్యులుంటారు. ఈ 23 మందిలో 12 మంది ఎఐసీసీ ద్వారా ఎన్నుకోబడిన 12 మంది సభ్యులుంటారు.  ఐదు రాష్ట్రాల Assembly ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 2017 ఎన్నికల్లో Punjab లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు దక్కించుకొంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. Uttarakhand, Goa, Manipurరాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ మెరుగైన సీట్లు దక్కించుకోలేదు.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం విన్పిస్తున్న G-23 నేతలు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ఎఐసీసీ కొత్త అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని కూడా అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ నెల 11వ తేదీన New Delhi లోని జీ 23కి నాయకత్వం వహిస్తున్న Ghulam Nabi Azad నివాసంలో కపిల్ సిబల్, మనీష్ తివారీ తదితరులు భేటీ అయ్యారు.


 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు