హైకోర్టు ఆదేశాలు:తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సోమేష్ కుమార్ భేటీ

By narsimha lode  |  First Published Jan 10, 2023, 3:16 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ తో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  భేటీ అయ్యారు.  సీఎస్ సోమేష్ కుమార్ ను  తెలంగాణ కేడర్ ను  రద్దు  చేస్తూ  హైకోర్టు  రద్దు చేసింది.  దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. 


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారంనాడు భేటీ అయ్యారు.  సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయిస్తూ  క్యాట్ ఇచ్చిన ఆదేశాలను  ఏపీ హైకోర్టు  మంగళవారంనాడు  రద్దు చేసింది. దీంతో  సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్ తో భేటీ ప్రాధాన్యత నెలకొంది.హైకోర్టు తీర్పు నేపథ్యంలో  ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ తో  సోమేష్ కుమార్ చర్చించే అవకాశం లేకపోలేదు.  హైకోర్టు తీర్పుపై  సుప్రీంకోర్టులో సోమేష్ కుమార్  సవాల్ చేస్తారా లేదా  అనే విషయమై  కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో  ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా  డీఓపీటీ  రెండు రాష్ట్రాలకు  కేటాయించింది.  సోమేష్ కుమార్ కు ఏపీ కేడర్ ను  డీఓపీటీ  అలాట్  చేసింది.  అయితే తాను  తెలంగాణకు  వెళ్తానని సోమేష్ కుమార్ చెప్పారు.తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ  క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  విచారణ నిర్వహించి సోమేష్ కుమార్ ను తెలంగాణ కేడర్ ను కేటాయించింది.  పరిపాలన పరంగా  ఇబ్బందులు ఏర్పడే  అవకాశం ఉన్నందున  సోమేష్ కుమార్ ను  ఏపీకి  కేటాయించాలని  కేంద్రం  వాదిస్తుంది.

Latest Videos

also read:సోమేష్ కుమార్ కి చుక్కెదురు:తెలంగాణ కేడర్ కేటాయింపును రద్దు చేసిన హైకోర్టు

ఇదే వాదనతో  కేంద్ర ప్రభుత్వం క్యాట్ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది.2017లో  తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ లో  ఈ   పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ పిటిషన్ పై  ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్  సోమేష్ కుమార్ ను  తెలంగాణ కేడర్ కు కేటాయించడాన్ని రద్దు  చేసింది. క్యాట్ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఏపీ కేడర్ ను  సోమేష్ కుమార్ కు  కేటాయించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో  సోమేష్ కుమార్  స్థానంలో  మరొకరి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా  లేకపోలేదు. ఈ విషయమై  ఇవాళ సాయంత్రానికి  స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. 

click me!