ఆ 24 కోట్లు ఎవడబ్బ సొమ్ము.. కేసిఆర్

First Published Jan 3, 2018, 8:51 PM IST
Highlights
  • పక్క రాష్ట్రాల్లో యాడ్స్ ఎందుకు ఇచ్చుకున్నారు
  • ఏం ఘనకార్యం చేశారని కోట్లు ఖర్చు చేసి యాడ్స్
  • యాడ్స్ లో అన్నీ అబద్ధాలే చెబుతారా?

తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1వ తేదీనాడు దేశ విదేశాల్లో పేపర్ యాడ్స్ ఇవ్వడం పట్ల అభ్యంతరం తెలిపారు. ఎవడబ్బ సొమ్మని 24 కోట్ల ప్రజా ధనం నీ ప్రచారం కోసం వాడుకున్నావు అని నిలదీశారు. తెలంగాణలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో పత్రికా ప్రకటనలు ఇవ్వడం అవసరమా అని ప్రశ్నించారు. ఆ యాడ్స్ లో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని కుండబద్ధలు కొట్టారు. ఏమి ఘనకార్యం చేశారని యాడ్స్ ఇచ్చుకున్నారని ప్రశ్నించారు.

కేసీఆర్ సీఎం అయ్యాక ఒక్క యూనిట్ కరంటు అయినా ఉత్త్పత్తి అయ్యిందా అని ప్రశ్నించారు. భూపాల పల్లి ,జైపూర్ జూరాల ప్రైజెక్టు లు కాంగ్రెస్ నిర్మించినవే కదా అని గుర్తు చేశారు. 24ఎవరి అబ్బసొమ్మాని కోట్ల యాడ్స్ ఇచ్చారు ? కేసీఆర్ ప్రొడక్షన్ పెంచలేదు కానీ.. కమిషన్ లకోసం ప్రవేట్ కంపెనీలతో అగ్రిమెంట్స్ చేసుకుని విద్యుత్ కొంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కావాలని జెన్ కో ను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. అవుట్ డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ నీ ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. భద్రాద్రి ,యాదాద్రి లో నేటికీ తట్టెడు మట్టి తీయలేదు కానీ.. ఉత్తుత్తి ప్రచారాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చత్తీస్ ఘఢ్ పవర్ ఓప్పందం పెద్ద కుంభకోణం అని ప్రకటించారు. తెలంగాణ ను మిగులు రాష్ట్రంగ ఇచ్చింది నిజం కాదా ? అని కేసిఆర్ కు సవాల్ విసిరారు.  

click me!