మునుగోడు ఉప ఎన్నికలు 2022: రేపటి నుండి కాంగ్రెస్ ప్రచారం

By narsimha lode  |  First Published Aug 31, 2022, 4:25 PM IST

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సెప్టెంబర్ 3వ తేదీన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి,  ఉత్తమ్ కుమార్ రెడ్డిలు  నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు.


హైదరాబాద్:మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరగే ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 3వ తేదీన  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మునుగోడుకు వెళ్లనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  గడప గడపలో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ప్రచారం చేయనున్నారు.  మునుగోడులో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్ధుల జాబితాను టీపీసీసీ నాయకత్వం ఎఐసీసీకి పంపింది.త్వరలోనే మునుగోడు అభ్యర్ధిని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది.  అభ్యర్ధిని ప్రకటించే లోపుగానే  నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రేపటి నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఇప్పటికే ఆయా మండలాలకు ఇంచార్జీలుగా నియమించిన నేతలు కూడా నియోజకవర్గాల్లోని మండలాల్లో మకాం వేయనున్నారు. 

ఈ నెల 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అదే రోజున ఆ పార్టీ చీప్ సోనియా గాంధీకి  రాజీనామా లేఖను పంపారు. అయితే అంతకు రెండు రోజుల ముందే తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Latest Videos

undefined

ఈ నెల 8వ తేదీ మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.   రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఆరు మాసాల్లోపుగా ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న మునుగోడులో జరిగిన సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 

మునుగోడులో తన సీటును తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. అయితే ఈ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తుంది. ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.

మునుగోడులో కాంగ్రెస్ బలంగానే ఉంటుంది.  మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చొప్పు న ఇంచార్జులను నియమించింది.  కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండా  జాగ్రత్తలు తీసుకుంటుంది.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  టీఆర్ఎస్  ప్రచార బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పై మంత్రి జగదీష్ రెడ్డి కేంద్రీకరించారు. 

మునుగోడు అసెంబ్లీ  స్థానానికి జరిగే ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ుప ఎన్నికల్లో విజయం సాధించేందుకు మూడు పార్టీలు తమశక్తి యుక్తులను ధారపోస్తున్నాయి.

click me!