సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించింది. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో మరణించిన బీహర్ కు చెందిన అమర జవాన్లకు కూడా ప్రభుత్వం సహాయం చేసింది.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్, బీహార్ సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు.
పాట్నా:బీహర్ కార్మికులు తెలంగాణ అభివృద్దికి ప్రతినిధులని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.గాల్వాన్ లోయలో మరణించిన బీహార్ కు చెందిన జవాన్లకు, సికింద్రాబాద్ బోయిగూడలో మరణించిన బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు ఆర్ధిక సహాయం అందించింది.
గాల్వాన్ లో వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.తెలంగాణకు బీహర్ నుండి లక్షల మంది కార్మికులు వలస వస్తారన్నారు. కరోనా సమయంలో కార్మికులను కేంద్రం ఇబ్బంది పెట్టిందన్నారు. అయితే ఆ సమయంలో స్వస్థలాలకు కార్మికులు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. కార్మికులు తమ స్వస్థాలకు పంపేందుకు 150 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే తెలంగాణ కొత్త రాష్ట్రమన్నారు.
undefined
గోదావరి తీరం నుండి గంగా నది తీరానికి రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కేసీఆర్ చెప్పారు. బీహార్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. రాష్ట్రం నుండి గతంలో ప్రాతినిథ్యం వహించిన నేతలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల గురించి ప్రస్తావించారు. గొప్ప సర్కార్ కేంద్రంలో ఉందంటూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
గాల్వాన్ లోయలో మరణించిన అమర జవాన్ల కుటుంబాలకు ఆదుకోవాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం గొప్పదని బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు. అమరుల కుటుంబాలకు కేంద్రమే కాదు రాష్ట్రాలు కూడా అండగా ఉండాలన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ సర్కార్ కార్మికుల కోసం ప్రత్యేకంగా రైళ్లు పెట్టడం అభినందనీయమన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ కూడా తమ రాష్ట్రానికి చెందిన కార్మికులకు సహయం అందాల్సిన అవసరం ఉందన్నారు.కేసీఆర్ మాదిరిగా కార్మికుల కోసం ఎవరూ ఆలోచించలేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు. కార్మికుల పట్ల కేసీఆర్ చాలా శ్రద్ద చూపారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ 2001 నుండి పోరాటం చేశారన్నారు.ఆ సమయంలో తాను కేంద్రంలో ఉన్నానని నితీష్ కుమార్ గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో కేసీఆర్ విజయం సాధించారని నితీష్ కుమార్ చెప్పారు. కేసీఆర్ పట్టుదల వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నవారికి అవగాహన లేదని నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు.తెలంగాణను తెచ్చిన కేసీఆర్ ను ప్రజలు వదులుకోరని నితీష్ కుమార్ చెప్పారు.
దక్షిణభారతదేశంలో తెలంగాణ ప్రధానమైన రాష్ట్రమని నితీష్ కుమార్ చెప్పారు.ప్రతి ఇంటికి నీరివ్వడమంటే మామూలు విసయం కాదన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ పై అధ్యయనం కోసం తమ రాష్ట్రం నుండి అధికారుల బృందాన్ని పంపిన విషయాన్ని నితీష్ గుర్తు చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన స్పూర్తితో బీహార్ లో మంచినీటి సమస్యను అధిగమిస్తామని నితీష్ కుమార్ ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇలాంటి అభివృద్ది ఎలా చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. మా వాళ్లు మీ రాష్ట్రంలో పనులు చేసుకుంటున్నారని నితీష్ కుమార్ చెప్పారు. తెలంగాణలో గ్రామీణాభివృద్ది అద్భుతంగా ఉందని నితీష్ కుమార్ ప్రశంసించారు. కేంద్రం రాష్ట్రాలకు నిధుల కోత పెడుతుందన్నారు నితీష్ కుమార్.
గాల్వాన్ అమర జవాన్లకు, సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ధన్యవాదాలు చెప్పారు. బీహర్ కు చెందిన బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తేజస్వి యాదవ్ చెప్పారు.
also read:బీహర్ లో సీఎం కేసీఆర్ టూర్: గాల్వాన్ అమర జవాన్లకు ఆర్ధిక సహాయం అందజేత
కేసీఆర్ మాదిరిగానే ప్రతి రాష్ట్రం స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడే అభివృద్ది ఉంటుందని తేజస్వియాదవ్ చెప్పారు. సమాజంలో ప్రస్తుతం ఉన్మాదం పెరుగుతుందన్నారు. ఇది సరైంది కాదన్నారు. వీర సైనికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. బీహార్, తెలంగాణ ప్రభుత్వాలు బాధిత కుటుంబాల వెంట ఉంటాయని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. దేశం సురక్షితంగా ఉందంటే సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులే కారణమని ఆయన చెప్పారు. సుఖ, దు:ఖాల్లో కలిసి మెలిసి సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఫెడరల్ వ్యవస్థను మరింత బలపర్చాలన్నారు. వెనుబడిన రాష్ట్రాలకు సహాయం చేయకపోతే దేశం అభివృద్ది చెందదన్నారు. బీహార్ బీద రాష్ట్రాలకు సహాయం అవసరమని ఆయన చెప్పారు.వీర సైనికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయడం అభినందనీయమన్నారు.