మర్రి శశిధర్ రెడ్డికి షాక్: కాంగ్రెసు మూడో జాబితా ఇదే...

Published : Nov 17, 2018, 11:00 AM ISTUpdated : Nov 17, 2018, 11:05 AM IST
మర్రి శశిధర్ రెడ్డికి షాక్: కాంగ్రెసు మూడో జాబితా ఇదే...

సారాంశం

జాబితాలో మర్రి శశిధర్ రెడ్డి పేరు లేదు, అదే సమయంలో సనత్ నగర్ సీటును కూన వెంకటేషం గౌడ్ ను కేటాయించినట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దీంతో శశిధర్ రెడ్డికి సనత్ నగర్ సీటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెసు అధిష్టానం శనివారం ఉదయం విడుదల చేసింది. ఈ జాబితాలో మర్రి శశిధర్ రెడ్డి పేరు లేదు, అదే సమయంలో సనత్ నగర్ సీటును కూన వెంకటేషం గౌడ్ ను కేటాయించినట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దీంతో శశిధర్ రెడ్డికి సనత్ నగర్ సీటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.

అధిష్టానంతో పోరు చేసి, తెలంగాణ జనసమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ ను ఒప్పించి జనగామ సీటును మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దక్కించుకున్నారు. ఈ మూడో జాబితాలో ఆయన పేరు చోటు చేసుకుంది. 13 మందితో కాంగ్రెసు అధిష్టానం ఈ జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెసు 88 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది.

కాగా, తెలుగుదేశం నాయకుడు సామ రంగారెడ్డి అడుగుతున్న ఎల్బీ నగర్ సీటుకు కాంగ్రెసు సుధీర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కాగా, కాంగ్రెసు మరో ఆరు స్థానాలను పెండింగులో పెట్టింది.

మూడో జాబితా ఇదే..

బోథ్ - సోబయం బాపూరావు
దేవరకొండ - బాలూ నాయకర్
తుంగతుర్తి - అద్దంకి దయాకర్
జనగామ - పొన్నాల లక్ష్మయ్య
నిజామబాద్ రూరల్ - రేకుల భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్ అర్బన్ - తాహెర్ బిన్ అమ్దాన్
బాల్కొండ - అనిల్ కుమార్
ఎల్బీ నగర్ - సుధీర్ రెడ్డి
బహదూర్ పూరా -ఖలీం బాబా
కార్వాన్ - ఉస్మాన్ అలీ మహ్మద్ 
యాకూత్ పూరా - పూర్ రాజేందర్ రాజు
కొల్లాపూర్ - హర్షన్ వర్దన్ రెడ్డి
ఇల్లందు - హరిప్రియ నాయక్

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ