అశ్వారావుపేటలో కాంగ్రెస్ తిరుగుబాటు

Published : Nov 17, 2018, 10:47 AM ISTUpdated : Nov 17, 2018, 10:48 AM IST
అశ్వారావుపేటలో కాంగ్రెస్ తిరుగుబాటు

సారాంశం

మహాకూటమిలో భాగంగా అశ్వారావుపేట టికెట్ టీడీపీకి దక్కడం పై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

మహాకూటమిలో భాగంగా అశ్వారావుపేట టికెట్ టీడీపీకి దక్కడం పై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని టీపీసీసీ మహిళా కాంగ్రెస్‌ కార్యదర్శి సున్నం నాగమణి అన్నారు. 

ములకలపల్లి మండల పరిధిలోని గుట్టగూడెం గ్రామంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని కాదని అతి తక్కువ బలం ఉన్న తెలుగుదేశం పార్టీకి టికెట్‌ కేటాయించడం బాధాకరమని అన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలోపేతానికి ఎంతో కృషి చేశానన్నారు. కార్యకర్తల మనోభావాల మేరకు, అధిష్టానంపై నమ్మకంతో నామినేషన్‌ వేశానని తెలిపారు.

కాగా.. ఆమె మద్దతుదారులు, ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం ఆమె నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ