నేడు కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ: బస్సు యాత్ర సహా కీలకాంశాలపై చర్చ

By narsimha lode  |  First Published Oct 10, 2023, 11:08 AM IST

కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఇవాళ గాంధీ భవన్ లో జరగనుంది. బస్సు యాత్ర సహా పలు కీలక అంశాలపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు.


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత  కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం  మంగళవారంనాడు సాయంత్రం గాంధీభవన్ లో జరగనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది.  బస్సు యాత్ర, తెలంగాణ ఎన్నికలపై  పీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. 

ఈ నెల  15వ తేదీ నుండి బస్సు యాత్రను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.బస్సు యాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ సహా యాత్రలో ప్రస్తావించాల్సిన అంశాలపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ నిన్ననే విడుదలైంది. దీంతో  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై కూడ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారంపై  కూడ నేతలు కేంద్రీకరించనున్నారు.

Tap to resize

Latest Videos

undefined

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం  ఈ నెల 9న  ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 3న  ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో  అన్ని పార్టీలు  తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.  ఈ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకొనేందుకు ప్రధాన పార్టీలు  కసరత్తు చేస్తున్నాయి.  బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాల్లో అధికారికంగా అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది.ఈ నెల  15న  అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలను అందిస్తారు. మరో వైపు బీజేపీ కూడ  రాష్ట్రంలో ఆ పార్టీ అగ్రనేతలు పర్యటించేలా ప్లాన్ చేస్తుంది. ఇవాళ  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. 

also read:కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యం: బస్సు యాత్ర తర్వాతే అభ్యర్థుల ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకు  అమిత్ షా దిశా నిర్ధేశం చేయనున్నారు.ఈ నెల రెండో వారంలో అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.  ఈ నెల 1, 3 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. వేల కోట్ల ప్రాజెక్టులకు  మోడీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

 

click me!