ప్యాకేజీలు పొందడం కాంగ్రెస్ సంసృతి కాదు .. మర్రి శశిధర్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఠాగూర్ ట్వీట్

By Siva KodatiFirst Published Nov 25, 2022, 6:45 PM IST
Highlights

బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు.

బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. ప్యాకేజీలు పొందడం కాంగ్రెస్ సంస్కృతి కాదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ వైస్ ఛైర్మన్‌గా, మంత్రిగా వున్నప్పుడు ఏమి ఇచ్చారని ఠాగూర్ ప్రశ్నించారు. 

కాగా.. మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది. ఇటీవల హస్తం పార్టీకి శశిధర్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను ఆ పార్టీ నేత అనిల్ గురువారం నోటీసులు పంపారు. 

ఇకపోతే.. కాంగ్రెస్  పార్టీ  నుండి  బహిష్కరణకు  గురైన  తర్వాత మర్రి శశిధర్ రెడ్డి  మంగళవారంనాడు  హైద్రాబాద్ లో మీడియాతో  మాట్లాడారు. చాలా  బాధతో  కాంగ్రెస్  తో బంధం తెంచుకుంటున్నానన్నారు. సోనియాగాంధీకి కూడా  ఈ  విషయమై  లేఖను  రాసినట్టుగా  శశిధర్  రెడ్డి  వివరించారు. ఈ పరిస్థితి  వస్తుందని  తాను  ఏనాడూ  ఊహించలేదని.. ప్రతిపక్ష పార్టీ పాత్ర  పోషించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ఇవాళ్టి  నుండి  కాంగ్రెస్ పార్టీ హోంగార్డుగా  తాను  ఉండడం  లేదని  ఆయన  చెప్పారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  పరిస్థితులు రోజు రోజుకు  దిగజారుతున్నాయని శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ALso Read:తెలంగాణకు గుర్తింపు తెచ్చింది మర్రి చెన్నారెడ్డి... ఆయన అడుగుజాడల్లోనే ముందుకు : శశిధర్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ గా  రేవంత్ రెడ్డి  బాధ్యతలు  చేపట్టిన  తర్వాత పరిస్థితులు  మరింత దిగజారినట్టుగా  ఆయన  చెప్పారు. పార్టీ సమావేశాల్లో  రేవంత్  రెడ్డి  గురించి ఠాగూర్ మాట్లాడనిచ్చే  పరిస్థితి  ఉండేది  కాదన్నారు. పార్టీ  అధిష్టానాన్ని  కలిసేందుకు  తాము  చేసిన ప్రయత్నాలు  ఫలించని  విషయాన్ని శశిదర్ రెడ్డి  వివరించారు. కోకాపేట భూముల విషయంపై కోర్టుకు  వెళ్లాలని నిర్ణయించినట్టుగా  శశిధర్ రెడ్డి  తెలిపారు. నీ రేవంత్ రెడ్డి  ఈ  భూముల  విషయంలో సైలెంట్  గా ఉన్నారన్నారు. జూరాబాద్  లో  మూడు వేల  ఓట్లు వస్తే  ఎవరికీ  కూడా  చీమ  కుట్టినట్టు  లేదన్నారు. హుజూరాబాద్  లో  మ్యాచ్  ఫిక్సింగ్  జరిగిందని  ఆయన  ఆరోపించారు. దుబ్బాకలో  ఏం  చేసినా  కూడా  కాంగ్రెస్ కు  డిపాజిట్ కూడా  రాలేదని  మర్రి శశిధర్  రెడ్డి  తెలిపారు. 

రేవంత్ రెడ్డి  బ్లాక్  మెయిలర్,  చీటర్ అంటూ  శశిదర్  రెడ్డి  తీవ్రమైన  విమర్శలు  చేశారు.  రేవంత్ రెడ్డిపై  తనకు  వేరే  ఉద్దేశ్యం లేదని  ఆయన  చెప్పారు. మునుగోడులో భువనగిరి  ఎంపీ  వెంకట్ రెడ్డికి తెలియకుండానే  సభను  పెట్టారన్నారు.  అద్దంకి దయాకర్  తో  వెంకట్  రెడ్డిపై  అలాంటి  వ్యాఖ్యలు  చేయాల్సింది  కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్  అవినీతిపై  మాట్లాడే  హక్కు కాంగ్రెస్ కు  లేదని  శశిధర్  రెడ్డి  తెలిపారు. 
 

Sangi Shashidhar ,
As you have joined Sangi’s now you will have to face the real question..
It’s not in congress culture to get packages …
if you think then
what you gave for being the Vice chairman NDRF ?
what you gave when you were made as minister?
Nothing…
You can lick https://t.co/s5y4Dxvvji

— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore)
click me!