విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published 18, Oct 2018, 2:43 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్  జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మినహా కూటమిలో ఏ పార్టీ గెలవలేదని తేల్చి చెప్పారు. మెదక్ జిల్లాలో సిద్ధిపేట మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ కే కేటాయించాలని స్పష్టం చేశారు. ఒకవేళ కూటమిలోని పార్టీలకు సీట్లిస్తే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. 
 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్  పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మినహా కూటమిలో ఏ పార్టీ గెలవలేదని తేల్చి చెప్పారు. మెదక్ జిల్లాలో సిద్ధిపేట మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ కే కేటాయించాలని స్పష్టం చేశారు. ఒకవేళ కూటమిలోని పార్టీలకు సీట్లిస్తే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. 

అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం ఇతర పార్టీలకు సీట్లిస్తే అంగీకరించబోరన్నారు. కాబట్టి మెదక్ జిల్లాలో అన్ని స్థానాలు కాంగ్రెస్సే పోటీ చెయ్యాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గం మాత్రం అన్ని నియోజకవర్గాల కంటే కాస్త భిన్నంగా ఉందని తెలిపారు. 
 

Last Updated 18, Oct 2018, 2:43 PM IST