పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదు : రేవంత్ కు కాంగ్రెస్ సీనియర్ల ఝలక్.. !!

By AN TeluguFirst Published Feb 16, 2021, 12:15 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు గా ఎప్పటినుంచో నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రైతుల ఉద్యమానికి మద్ధతుగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగియబోతోంది. ఈ యాత్ర ముగింపుకు వచ్చిన తరుణంలో మరోసారి వీరి మధ్య కుమ్మలాటలు బహిర్గతం అయ్యాయి. 

తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడుకు పగ్గాలు వేయడం తమ వల్ల కాదని కాంగ్రెస్ సీనియర్లకు అర్థమవుతున్నా ఏదో రకంగా అడ్డంకులు కలిగిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి వీటన్నింటికీ సిద్ధపడే ముందుకు సాగుతున్నారు. ఎక్కడా స్పీడ్ తగ్గకుండా చూసుకుంటూ ముందుకు దూకుతున్నారు. 

రేవంత్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కొత్తపాట అందుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మణిక్కం ఠాగూర్ హాజరు కావాల్సి ఉంది. 

ఠాగూర్ హాజరవుతారని రేవంత్ రెడ్డి వర్గం ప్రచారం చేసుకుంది. అయితే సీనియర్ల కొత్త ఎత్తుగడ తో ఆయన వస్తారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికలో కూడా మాణిక్కం ఠాగూర్ కీలకంగా వ్యవహరించారు. 

అయితే చివరి క్షణంలో అధిష్టానం మనసు మార్చుకుని వాయిదా వేసింది. ఠాగూర్ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారనే ప్రచారం జరిగింది. వీహెచ్ లాంటి సీనియర్ నేత ఆ విషయం బహిరంగంగానే చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు ఠాగూర్ వస్తారా? రారా? అన్న విషయంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 
 
click me!