అక్కడ మద్యం సేవించిన... ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్

Arun Kumar P   | Asianet News
Published : Feb 16, 2021, 11:39 AM IST
అక్కడ మద్యం సేవించిన... ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్

సారాంశం

నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు సిపి అంజనీ కుమార్ ప్రకటించారు.   

హైదరాబాద్: హైదరాబాద్ కమీషనరేట్ సమీపంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లపై కమీషనర్ అంజనీ కుమార్ చర్యలు తీసుకున్నారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు సిపి ప్రకటించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే ముగ్గురు కానిస్టేబుళ్లు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూర్చుని మద్యం సేవించారు. వీరిని గమనించిన ఓ షాడో పోలీస్ వీడియో తీస్తుండగా సదరు కానిస్టేబుళ్లు అతడిపై దాడికి దిగారు. మద్యం మత్తులో అతడిని చితకబాదారు. 

దీంతో సదరు షాడో పోలీస్ తనపై జరిగిన దాడిచేయడంపైనే కాకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్ భద్రతను విస్మరించి మద్యం సేవించడం పైనా ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనను సీరియస్ తీసుకున్న సిపి విచారణకు ఆదేశించారు. ఈ విచారణకు సంబంధిచిన రిపోర్ట్ ఆదారంగా ముగ్గురు కానిస్టేబుళ్లను సిపి సస్పెండ్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu