రేవంత్‌కి పీసీసీ ఇస్తే నేనుండను, సీబీఐకి లేఖ రాస్తా: వీహెచ్ సంచలనం

By narsimha lodeFirst Published Dec 25, 2020, 12:54 PM IST
Highlights

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని అప్పగిస్తే తాను పార్టీని వీడుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్:రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని అప్పగిస్తే తాను పార్టీని వీడుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

శుక్రవారం నాడు ఆయన  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తనతో పాటు ఇతర నేతలు కూడ తమ దారిని తాము చూసుకొంటారని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ వ్యతిరేకికి పీసీసీ చీఫ్ పదవిని ఎలా ఇస్తారని ఆయన అడిగారు.

రేవంత్ కంటే నాకు కూడ చాలా క్రేజ్ ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకొంటున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వడం ఇస్తారా  అని ఆయన ప్రశ్నించారు. 

also read:చివరి అంకానికి టీపీసీసీ చీఫ్ రేస్: ఆ ఇద్దరి మధ్యే పోటీ, సీనియర్ల అసహనం

ఆర్ఎస్ఎస్ వ్యక్తి కింద తాను పనిచేయనని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తానని చెప్పారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఈ విషయమై మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. గ్రేటర్ లో 48 సీట్లు తీసుకొని రేవంత్ ఎందరు కార్పోరేటర్లను గెలిపించారన్నారు. 

పార్టీ కోసం పనిచేసే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డికి కూడ పీసీసీ చీఫ్ పదవికి పనికిరారా అని ఆయన ప్రశ్నించారు.

click me!