యశోద ఆసుపత్రిలో చేరిన జానారెడ్డి: స్టంట్ వేసిన వైద్యులు

By narsimha lode  |  First Published Apr 12, 2023, 10:43 AM IST

 కాంగ్రెస్ సీనియర్ నేత  జానారెడ్డి  యశోద ఆసుపత్రిలో  చేరారు.  జానారెడ్డికి  వైద్యులు  స్టంట్  వేశారు.  


హైదరాబాద్: మాజీ మంత్రి , కాంగ్రెైస్ సీనియర్ నేత జానారెడ్డి  యశోద  ఆసుపత్రిలో  చేరారు. హైద్రాబాద్ లోని  యశోద ఆసుపత్రిలో  వైద్య చికత్స  కోసం  ఆయన  చేరారు. మంగళవారంనాడు  మోకాలి చికిత్స  కోసం  జానారెడ్డి  యశోద ఆసుపత్రికి  వెళ్లారు. మోకాలికి  చికిత్స  సమయంలో  పలు  రకాల పరీక్షలు  నిర్వహించారు. ఈ పరీక్షల్లో  జానారెడ్డి గుండె రక్త నాళం  ఒకటి  మూసుకుపోయినట్టుగా  గుర్తించారు. వైద్యులు. నిన్న  రాత్రే జానారెడ్డికి  వైద్యులు  స్టంట్ వేశారు.  

రాహుల్ గాంధీపై అనర్హత విషయమై   ఇటీవల  హైద్రాబాద్  గాంధీ  భవన్  వద్ద  నిర్వహించిన  ఆందోళన  కార్యక్రమాల్లో  జానారెడ్డి  పాల్గొన్నారు.   సీఎం  పదవి తప్ప  అన్ని రకాల  మంత్రి  పదవులను  జానారెడ్డి  నిర్వహించారు. 2018  ఎన్నికల్లో  నాగార్జునసాగర్ నుండి  పోటీ చేసి  జానారెడ్డి  ఓటమి పాలయ్యాడు.  బీఆర్ఎస్ అభ్యర్ధి  నోముల నరసింహయ్య  చేతిలో  జానారెడ్డి  ఓటమి పాలయ్యాడు.

Latest Videos

 నోముల నరసింహయ్య  మృతితో నాగార్జున సాగర్  అసెంబ్లీ  స్థానానికి  జరిగిన  ఉప ఎన్నికల్లో   జానారెడ్డి  పోటీ  చేశారు.  నోముల నరసింహయ్య  తనయుడు   భగత్  చేతిలో జానారెడ్డి  ఓటమి పాలయ్యాడు.   నాగార్జునసాగర్  ఉప ఎన్నికల్లో  ఓటమి తర్వాత   పార్టీ కార్యక్రమాల్లో  గతంలో మాదిరిగా  జానారెడ్డి  చురకుగా  పాల్గొనడం లేదు.  

పార్టీ కీలక నేతలు వచ్చిన  సమయంలో నిర్వహించే  సమావేశాలకు  ఆయన  హాజరౌతున్నారు.  వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో  జానారెడ్డి  తనయుడు  పోటీ  చేసే  అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుందిరెండు  స్థానాల్లో  పోటీ  చేసే  అవకాశాన్ని  పార్టీ  కల్పిస్తే  మిర్యాలగూడ,  నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాల్లో  జానారెడ్డి తో  పాటు  ఆయన  తనయుడు  పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.

click me!