మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి బీజేపీకి ఓటేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పినట్టుగా ఉన్న ఆడియో కలకలం రేపుతుంది. ఈ ఆడియోపై కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్:మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఎన్నికల్లో పార్టీ చూడకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఆడియో సంభాషణ ఉంది .ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పీసీసీ చీఫ్ గా తాను ఎన్నికై రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా చెప్పారు.అంతేకాదు పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని ప్రకటించారు.అయితే ఈ ఆడియో కోమటిరెడ్డి వెంకట్ రెడ్దిదా లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
తనను పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించే కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి నిన్న ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో కలకలం రేపింది. గతంలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీకైంది. రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలని వెంకట్ రెడ్డి కోరిన విషయం కూడ అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.
undefined
టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ లు గతంలో తనపై చేసిన విమర్శల కారణంగా మునుగోడు ప్రచారానికి దూరంగా ఉండాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. అయితే పార్టీలో కొందరు నేతల మధ్య సమన్వయం లేని కారణంగా పార్టీకి ఇబ్బందికరంగా మారింది.మరో వైపు వెంకట్ రెడ్డి ఆడియో ప్రస్తుతం పార్టీలో చర్చకు దారి తీసింది.
also read:మునుగోడు బైపోల్ : రేవంత్ రెడ్డి కంట కన్నీరు.. తనను ఒంటరి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన..
మునుగోడులో ప్రచారానికి రావాలని కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. అయితే పాల్వాయి స్రవంతికి తన ఆశీర్వాదాలుంటాయని ఆయన హామీ ఇచ్చారు. ప్రచారానికి వచ్చే విషయమై ఆలోచిస్తానని తనకు చెప్పారని స్రవంతి ఇటీవలనే మీడియాకు చెప్పారు. కానీ పార్టీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం ఆమెకు షాక్ కు గురి చేసింది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఫిర్యాదు
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పినట్టుగా ఉన్న ఆడియో పై ఎఐసీసీకి ఫిర్యాదు చేశారు నేతలు.ఎస్సీ సెల్ నేత ప్రీతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజయం సాధించిన మల్లికార్జున ఖర్గేకి ,ఎఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ,ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న వైరి వర్గం ఈ ఆడియో అంశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొనే అవకాశం లేకపోలేదు.