Revanth Reddy Vs Kavitha: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య ఎంతో బాధ కలిగించిందని.. ఇలాంటి పరిస్థితి ఏ తల్లి దండ్రులకూ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.
Revanth Reddy Vs Kavitha: అసెంబ్లీ ఎన్నికల ప్రకటన రావడంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. క్రమంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా.. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రోస్ పార్టీకి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్ చేశారు.
‘నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా తొమ్మిదేళ్లు నీరోను తలపించిన కేసీఆర్… ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్ధులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని పరీక్ష పెడుతున్నాడు. గ్రూప్ -2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తోన్న డిమాండ్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అని ట్వీట్ రేవంత్ రెడ్డి చేశారు.
ఈ ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య ఎంతో బాధ కలిగించిందని.. ఇలాంటి పరిస్థితి ఏ తల్లి దండ్రులకూ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'బతుకమ్మ చేస్తాము.. బాధనూ పంచుకుంటాము.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరిచేలా మాట్లాడటం కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యం. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రశ్నించారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు.
నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలకు బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.
గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయలేదా? వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయలేదా? శవాల మీద పేలాలు ఏరుకోవడం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ రెడ్డి ఆవేదన బూటకం... కాంగ్రెస్ ఆందోళన నాటకం' అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
బతుకమ్మ చేస్తాము..
బాధను కూడా పంచుకుంటాము..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం...
ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakh