స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొంటే రూ. 5 లక్షల సహాయం: కాంగ్రెస్ మేనిఫెస్టో‌లో వరాలు

By narsimha lodeFirst Published Nov 24, 2020, 2:06 PM IST
Highlights

ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకొనే వారికి రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

హైదరాబాద్: ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకొనే వారికి రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

మంగళవారం నాడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నగర ప్రజలకు  కాంగ్రెస్ పార్టీ హామీలను కురిపించింది.

జీహెచ్ఎంసీ మేయర్ గా కాంగ్రెస్ ను గెలిపిస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చింది.  ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామన్నారు. ధరణి పోర్టల్  రద్దుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

మురికివాడల అభివృద్ధికి అథారిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సఫాయి కర్మచారుల కుటుంబాలకు రూ. 20 లక్షల భీమా సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్.

సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లకు పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మాల్స్, మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.  షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లలో పార్కింగ్ ను జీహెచ్ఎంసీ పరిధిలోకి తెస్తామన్నారు. రాత్రి 10 గంటలకే బార్లు, మద్యం దుకాణాలను మూసివేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

also read:టీఆర్ఎస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయండి: ప్రజలకు ఉత్తమ్ పిలుపు

ఎంఎంటీఎస్, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది కాంగ్రెస్.

వరద బాధితులకు రూ. 50 వేల పరిహారం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.2.5 లక్షల నుండి రూ. 5లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

80 గజాలలోపు ఇల్లును నిర్మించుకొన్నవారికి ఆస్తిపన్నును పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.ప్రతి కుటుంబానికి ఉచితంగా 30 వేల లీటర్ల మంచినీటిని అందిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.


 

click me!