నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు నీవేక్కడా?: కేటీఆర్ ను ప్రశ్నించిన రఘునందన్ రావు

By narsimha lode  |  First Published Feb 5, 2023, 1:01 PM IST

బీహర్ రాష్ట్రానికి  చెందిన  నలుగురు ఐపీఎస్ అధికారులకే   రాష్ట్రంలోని  పోలీస్ శాఖలో  నాలుగు కీలక పోస్టులను  కేసీఆర్ కట్టబెట్టారని   బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు  చెప్పారు.  
 


హైదరాబాద్: అధికారం  ఎప్పటికీ శాశ్వతం  కాదనే  విషయాన్ని గుర్తుంచుకోవాలని   బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు  తెలంగాణ మంత్రి కేటీఆర్ కు గుర్తు  చేశారు .ఆదివారం నాడు  హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  మీడియాతో మాట్లాడారు.తమకు  అసెంబ్లీలో  మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు.   తనపై  కేటీఆర్ లేనిపోని  విమర్శలు చేస్తున్నారన్నారు. తాను  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని  రఘునందన్ రావు  గుర్తు  చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో  కేటీఆర్  ఎక్కడ ఉన్నాడని   రఘునందన్ రావు ప్రశ్నించారు. 

సిద్దిపేట, సిరిసిల్లలో తనకు  పరపతి  ఉందో లేదో  వచ్చే ఎన్నికల్లో  చూపిస్తానని  రఘునందన్ రావు  చెప్పారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న దుబ్బాకలో  కేటీఆర్ సహ ఎవరొచ్చినా  తాను  స్వాగతిస్తున్నట్టుగా  రఘునందన్ రావు  తెలిపారు.  రాష్ట్రంలోని  50 సీట్లే కాదు  రాష్ట్రంలోని  అన్ని సీట్లలో  ఎంఐఎం  పోటీ చేయడంలో తప్పు లేదన్నారు.   బీఆర్ఎస్ కు ఓటేసినా.. ఎంఐఎంకు  ఓటేసినా ఒక్కటేనని  నిన్న అసెంబ్లీలో  అక్బరుద్దీన్ ఓవైసీ  చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్ధమౌతుందన్నారు.

Latest Videos

తెలంగాణ  పోలీస్ శాఖలో  నాలుగు కీలక పోస్టుల్లో  బీహర్ కు  చెందిన వారికే  పోస్టులు  కేటాయించారని  రఘునందన్ రావు  తెలిపారు.  డీజీపీ అంజనీకుమార్, శాంతిభద్రతల అడిషనల్  డీజీ  సంజయ్ కుమార్ జైన్, హైద్రాబాద్  ఐజీ షానవాజ్ ఖాసీం,  తెలంగాణ స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీ స్వాతి లక్రాలు బీహర్ కు  చెందినవారేనని ఆయన  చెప్పారు.తెలంగాణ  ఐపీఎస్ లకు  ఒక్క మంచి పోస్టింగ్  కూడా ఇవ్వలేదని  ఆయన  చెప్పారు.  ఇదంతా  చూస్తూ  కేసీఆర్ మూలాలు  బీహర్ లో  ఉన్నాయనే అనుమానం కలుగుతుందని చెప్పారు. 

తెలంగాణలో  గూండారాజ్  తీసుకురావద్దని ఆయన  కోరారు.  రాష్టరంలో  93 మంది  ఐపీఎస్ ల బదిలీలను  ఎన్నికలను దృష్టిలో  పెట్టుకొనే  చేశారని ఆయన  ఆరోపించారు.  2023  ఎన్నికల టీమ్ గా  ప్రచారం సాగుతుందని  చెప్పారు.
 

click me!